అందుబాటులోకి రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ ప్లస్... మరి విశేషాలేంటంటే...?!

భారతీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంటర్ అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

మొదటగా భారతీయులు నెలకు అంతా కలిపి ఒక జీబి లేదా రెండు జీబి డేటా ను ఉపయోగించేవారు.

ఇప్పుడు రోజుకి 2 జిబి పైన వాడేస్తున్నారంటే అది కేవలం రిలయన్స్ జియో పుణ్యమే.అవును రిలయన్స్ జియో రాకముందు ఒక్క జీబి నెట్ కావాలి అంటే వందలకు వందలు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది.

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ఒక జిబి డేటా కేవలం పది రూపాయల కంటే తక్కువగా ఉండే విధంగా పరిస్థితి మారిపోయింది.

అంతలా రిలయన్స్ జియో భారత టెలికాం రంగాన్ని మార్చేసింది.ఇక జియో మరోసారి రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ అనే పేరుతో అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలను తీసుకువస్తోంది.

Advertisement

ఇందులో ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్, డిస్నీ హాట్స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ సర్వీసులను సబ్స్క్రిప్షన్ అందించే విధంగా మొత్తం 600 పైగా లైవ్ టీవీ చానల్స్, అలాగే వేల సంఖ్యలో వీడియో కంటెంట్ ఉన్న జియో యాప్స్ కి ఉచితంగా సబ్స్క్రిప్షన్ లభించనుంది.అంతేకాదండోయ్.

ఒక్క కనెక్షన్ కి కేవలం 250 రూపాయలు ఎక్కువ చెల్లించడం ద్వారా వారు ఫ్యామిలీ ప్లాన్ ను కూడా పొందవచ్చు.ఇందులో భాగంగానే ఒకవేళ పోస్ట్ పెయిడ్ ప్లాన్ లో ఇదివరకు నెలలో ఏదైనా డేటాను వినియోగించకపోతే దానిని మరుసటి నెలకు ఫార్వర్డ్ చేసేవిధంగా చూసుకోవచ్చు.

ఇలా ఏకంగా 500 జీబీ డేటాను వాడే అవకాశం లభిస్తుంది.వీటితో పాటు అనేక అంతర్జాతీయ సేవలకు సంబంధించి కూడా ప్రయోజనాలు లభిస్తాయి.

మరీ ముఖ్యంగా భారతదేశం నుంచి విదేశాలకు ప్రయాణం చేసే భారతీయ వినియోగదారులకు విమానాలలో ఇంటర్నెట్ సేవలను అందించబోతుంది.అంతేకాదు అరబ్ కంట్రీస్, అమెరికా లో ఉచితంగా అంతర్జాతీయ రోమింగ్ సదుపాయాన్ని కల్పించబోతోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

వీటితో పాటు అంతర్జాతీయ కాల్స్ ధర నిమిషానికి కేవలం 50 పైసలు చెల్లిస్తే సరిపోతుంది.ఇక ఈ జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్ లో భాగంగా 399, 599, 799 999, 1499 ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.

Advertisement

ఒక్కొక్క ప్లాన్ లో ఒక్కో రకమైన సర్వీసులను అందించబోతున్నారు జియో సంస్థ యాజమాన్యం.

తాజా వార్తలు