వామ్మో.. కాజల్ రిజెక్ట్ చేసిన సినిమా లిస్ట్ ఇంత పెద్దగా ఉందా?

ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే టాలీవుడ్ చందమామ గా గుర్తింపు సంపాదించింది కాజల్ అగర్వాల్.

తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అయితే కుర్ర హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది.అంతేకాదు ఇక ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలందరితో కూడా జత కట్టి వారికి కూడా పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది అనే విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించింది.అదే సమయంలో ఇక కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ కూడా కాస్త పెద్ద గానే ఉంది అని చెప్పాలి.

ఆ వివరాలు ఏంటో చూద్దాం.

అలివేలుమంగా వెంకటరమణ :

కాజల్ ను లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది దర్శకుడు తేజ. దీంతో ఆయన అంటే కాజల్కు ప్రత్యేకమైన అభిమానం.ఆయన ఏ సినిమా కోసం అడిగిన అసలు నో చెప్పద్దు.

Advertisement
Rejected Movies List Of Kajal Agarwal Details, Kajal Aggarwal, Heroine Kajal Agg

తేజ మీద నమ్మకంతో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాకు కూడా ఎస్ చెప్పేసింది కాజల్.ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సీత అనే సినిమాలో కూడా నటించింది.

అయితే గోపీచంద్ హీరోగా అటు తేజ అలివేలు మంగ వెంకటరమణ సినిమా అనౌన్స్ చేశారు.ఇందులో కాజల్ హీరోయిన్ అనుకున్నప్పటికీ కాజల్ బిజీ డేట్ కారణంగా రిజెక్ట్ చేసిందట.

దీంతో తర్వాత తాప్సీని తీసుకున్నారు.

Rejected Movies List Of Kajal Agarwal Details, Kajal Aggarwal, Heroine Kajal Agg

సాహో :

డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో ప్రభాస్ కి పర్ఫెక్ట్ జోడి కాజల్ అంటూ ప్రేక్షకులందరిలో కూడా భావన కలిగించింది.ఇద్దరూ లవ్ లో ఉన్నారు అంటూ గాసిప్ కూడా వచ్చేసింది.అయితే తరువాత చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో సినిమాలో కాజల్ ని అనుకున్నారట దర్శకుడు.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

కాజల్ రెబల్ సినిమా కోసం కూడా అడిగారట.కానీ బిజీ డేట్స్ కారణంగా కుదరలేదట.

Advertisement

తేజ - కాజల్ :

సాధారణంగా తేజ సినిమా అంటే కాజల్ అసలు నో చెప్పదు.కానీ వెంకటేష్ తో ఒక సినిమా లో నటించాలని తేజ అడిగితే ఎందుకో రిజెక్ట్ చేసిందట.మరో విషయం ఏంటంటే ఇక ఈ సినిమా కూడా ఆ తర్వాత క్యాన్సిల్ అయిపోయింది.

తుంగ వనం :

కమల్ హాసన్ తో ప్రస్తుతం భారతీయుడు 2 లో నటిస్తోంది కాజల్ అగర్వాల్.అయితే గతంలో కమల్ హీరోగా తుంగ వనం అనే సినిమా వచ్చింది అనే విషయం తెలిసిందే.ఈ సినిమాలో కాజల్ తీసుకోవాలని అనుకున్నారు.కానీ కాజల్ మాత్రం సినిమా రిజెక్ట్ చేసింది

ఉదయనిది స్టాలిన్ :

టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సమయంలోనే తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సినిమాలో నటించేందుకు ఆఫర్ కొట్టేసిందట కాజల్ అగర్వాల్. ఆ సమయంలో వేరే సినిమాతో బిజీగా ఉండడంతో ఇక సినిమాకు సున్నితంగా నో చెప్పేసిందట.

పైసా వసూల్ :

పూరి జగన్నాథ్, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన పైసా వసూల్ సినిమా కోసం కూడా కాజల్ ని సంప్రదించారట.కానీ అప్పటికే డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఈ అమ్మడు బాలయ్య సినిమాకు ఇష్టం లేకపోయినా నో చెప్పక తప్పలేదు.బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి లో కూడా కాజల్ అనుకున్నప్పటికీ.

అప్పుడు ఖైదీ నెంబర్ 150 లో బిజీగా ఉండటంతో చివరికి ఆ సినిమాలో కూడా నటించలేదు.

ఇవి మాత్రమే కాకుండా నాగార్జున సులేమాన్ కాంబినేషన్లో వచ్చిన వైల్డ్ డాగ్, ప్రవీణ్ సత్తారు.నాగార్జున కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఘోస్ట్, రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలూ కూడా కాజల్ రిజెక్టెడ్ లిస్టులో ఉన్నాయట.

తాజా వార్తలు