నేరేడుచర్లలో రెడ్ బుక్ డే

సూర్యాపేట జిల్లా: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న రాష్ట్రంలోని ప్రతి సిపిఎం శాఖలో రెడ్ బుక్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిపిఎం నేరేడుచర్ల పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్ తెలిపారు.

మంగళవారం నేరేడుచర్ల మున్సిపల్ కేంద్రంలోని అరిబండి భవన్లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెడ్ బుక్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేరేడుచర్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలోఈ కార్యక్రమం నిర్వహించామని,ఇందులో భాగంగా భారత విప్లవ పోరాటం భగత్ సింగ్ అనే పుస్తకాన్ని చదవడం జరిగిందన్నారు.

స్వాతంత్ర పోరాటంలో కామ్రేడ్ భగత్ సింగ్ చేసిన పోరాటం, ఆయన విప్లవస్పూర్తి, పట్టుదల నేటి యువతకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు.భగత్ సింగ్ ను1931 మార్చి 23న తన 23వ ఏటా బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీయడం జరిగిందన్నారు.

నేటి రాజకీయాల్లో భగత్ సింగ్ విప్లవస్పూర్తిని, ఆయన చరిత్రను దేశ ప్రజలకు తెలియపరచాలని అన్నారు.నేటి మతోన్మాద భావజాలాన్ని వారి వికృత శ్రేష్టలను దేశ ప్రజలకు ముఖ్యంగా యువతీ యువకులకు తెలియపరిచేందుకు రానున్న కాలంలో మతోన్మాదంపై పోరాటం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు కుంకు తిరుపతయ్య,నీలా రామ్మూర్తి,సట్టు శ్రీను, పాతూరి శ్రీనివాసరావు, జొన్నలగడ్డ వెంకన్న, బొల్లెపల్లి శ్రీను,సట్టు కోటయ్య,గుర్రం యేసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

Latest Suryapet News