గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి గొడవ ఏపీ రాజకీయాల్లో రణరంగాన్ని తలపిస్తోంది.స్థానిక MLA వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడటంతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి.
పార్టీ కార్యాలయం పై వైసీపీ ప్రభుత్వం కావాలని దాడికి పాల్పడినట్లు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి గన్నవరంకి బయలుదేరిన తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత పట్టాభిరాం సహా పలువురి నాయకులను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.
ఈ క్రమంలో గన్నవరం దాడులకు సంబంధించిన అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ నేతలకు గన్నవరం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.

మరోపక్క పట్టాభిరామ్ భార్య చందనా తన భర్తని అన్యాయం అరెస్ట్ చేశారని డీజీపీ ఆఫీస్ కి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు.ఈ పరిణామంతో ఆమె తన భర్తకి ఏమైనా అయితే దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి, డీజీపీ లదే అని.ఇంటిలోనే నిరసన తెలియజేయడం జరిగింది.అనంతరం తన భర్త పట్టాభి పై చేయి చేసుకున్నట్లు ఆమె ఆరోపించింది.కాగా గన్నవరం పరిధిలో దాడులు జరుగుతున్న క్రమంలో అక్కడ పోలీసులు 144 సెక్షన్ విధించారు.
ఈ దాడులకు సంబంధించి పట్టాభి సభ 16 మంది టీడీపీ నేతలకీ గన్నవరం కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించడం సంచలనం సృష్టించింది.







