మాంద్యం ఎఫెక్ట్ : ఇప్పటికే 12 వేల మందికి ఉద్వాసన.. వేల మంది భారతీయ టెక్కీల మెడపై వేలాడుతోన్న కత్తి

ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం గంటలు మోగడం ప్రారంభమైంది.స్టాక్ మార్కెట్లు పతనం కావడంతో ధరలు, నిరుద్యోగం విపరీతంగా పెరుగుతోంది.

2008 ఆర్ధిక సంక్షోభం సమయంలో 14 మిలియన్లకు పైగా ఉద్యోగాలు పోయాయి.ఇది భారత్ సహా అధిక ఆదాయ దేశాలది మాత్రమే.

ఆర్ధిక పరిస్ధితి ప్రస్తుతం దిగజారుతున్న నేపథ్యంలో అగ్రశ్రేణి ఆర్ధిక వేత్తలు హెచ్చరించినట్లుగా భారత్ లోని శ్రామిక వర్గం, ఉద్యోగుల్లో కోత వచ్చే అవకాశం వుందని సర్వేలు చెబుతున్నాయి.ఇప్పటి వరకు 2022లో భారత్ లోని సాంకేతిక రంగం 22,000 మంది నైపుణ్యం కలిగిన కార్మికుల స్కేల్ లో ఉద్యోగ నష్టాలను చవి చూసింది.

ఈ కాలంలో భారతీయ స్టార్టప్ రంగంలో 12,000 మంది ఉద్యోగాలను కోల్పోయారు.వీటిలో ఓలా, బ్లింకిట్, అనాకాడెమీ, బైజు (వైట్ హ్యాట్ జూనియర్, టాపర్), వేదాంటు, కార్స్ 24, మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎమ్‌పీఎల్) , ఎంఫైన్, లిడో లెర్నింగ్, ట్రెల్ , ఫార్ఐ, ఫర్లాంకో తదితర కంపెనీలు వున్నాయి.

Advertisement

మిలియన్ల కొద్దీ నిధులు అందుకున్నప్పటికీ.కనీసం 50,000 మంది స్టార్టప్ ఉద్యోగులను 2022లోనే తొలగించాలని చూస్తున్నారని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Crunchbase వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.కోవిడ్ మహమ్మారిని తమ విజయానికి బలమైన మద్ధతుగా భావించిన స్టార్టప్‌లు ప్రస్తుతం ఆర్ధిక మాంద్యం ప్రభావాన్ని అనుభవిస్తున్నాయని తెలిపింది.వాటి విలువలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని.విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడమే ఈ పరిస్ధితికి కారణమని నిపుణులు అంటున్నారు.100 శాతం ఉద్యోగుల సామర్ధ్యంతో నడుస్తూ.కొత్త నిధులను సమీకరించడం ప్రస్తుత పరిస్ధితుల్లో కష్టమన్నారు.

మార్కెట్ వాతావరణం ప్రస్తుతం ప్రతికూలంగా వుందని చెబుతున్నారు.నెట్‌ఫ్లిక్స్, రాబిన్‌హుడ్ వంటి అమెరికన్ టెక్ కంపెనీలు కూడా వర్క్‌ఫోర్స్ పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయి.

ఇవే కాదు టెస్లా వంటి దిగ్గజ కంపెనీలు సైతం జీతభత్యాలను , ఉద్యోగులను పది శాతం మేర తగ్గించే పనిలో వున్నాయి.జెమిని, క్రిప్టో.

ఒకప్పుడు చదువులో ఫెయిల్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
ఆ షాట్స్ ను డైరెక్ట్ గా కాపీ కొడతాను.. వైరల్ అవుతున్న జక్కన్న సంచలన వ్యాఖ్యలు!

కామ్, కాయిన్ బేస్, వాల్డ్, బైబిట్, బిట్‌పాండా వంటి ఇతర క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజీలపైనా మాంద్యం ప్రభావం ఆల్రెడి స్టార్ట్ అయ్యంది.ఈ నేపథ్యంలో క్రిప్టో క్రాష్ ను బట్టి తమ వర్క్ ఫోర్స్ ను తగ్గించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

Advertisement

ప్రపంచ ప్రఖ్యాత Pokemon GO గేమ్ డెవలపర్ Niantic తన వర్క్‌ఫోర్స్‌లో 8 శాతం మందిని కంపెనీని విడిచిపెట్టాలని కోరినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు