మొటిమలు గిల్లకూడదు అని ఎందుకంటారంటే?

యుక్త వయసు రాగామే యువతీయువకులు ఎదుర్కొనే ప్రధాన సమస్య మొటిమలు.ఇవి జీన్స్ ద్వారా, ఆయిల్ స్కిన్ ద్వారా, స్ట్రెస్ ద్వారా వస్తాయి.

సైన్స్ ప్రకారం లోతుగా చెబితే హార్మోన్ల సమతుల్యం లేకపోవడం వలన ఇవి ఏర్పడతాయి.ఈ మొటిమలు చూడ్డానికి ఒక్కోసారి పెద్దగా కూడా ఉంటాయి.

దీని వలన ముఖం తీరే మారిపోయి, మంటగా, చిరాగ్గా ఉంటుంది.ఆ బాధ తట్టుకోలేకే మొటిమను గిల్లేస్తుంటారు.

అలా గిల్లకూడదు అని పెద్దవాళ్ళు, డాక్టర్లు చెప్పినా, చేతులు మొటిమల మీదికే వెళతాయి.అసలు ఈ మొటమలను గిల్లకూడదని ఎందుకు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఆయిల్, డెబ్రిస్, ఆక్నే బ్యాక్టీరియా .వీటి కలబోతే మొటిమ.మొటిమను గిల్లినప్పుడు దాంట్లో ఉన్న ఆ ఆక్నే బ్యాక్టిరియా, కేవలం మీ చర్మం బయటే కాదు, లోపల కూడా వేరే పోర్స్ లోకి చేరుతుంది.

ముఖాన్ని బయట కడుక్కున్నంత మాత్రానా, లోపల జరిగే చర్యను ఆపలేం కదా.ఈ రకంగా ఒక్క మొటిమను గిల్లడం వలన మరో మొటిమ పుడుతుంది.అలా గిల్లిన కొద్ది ముఖమంతా మొటిమలు అవుతూనే ఉంటాయి.

దానికితోడు మచ్చలు, రంధ్రాలు అదనం.గిల్లడం వలన గోళ్ళలో ఉండే బ్యాక్టీరియా కూడా మీ చేతులతో మీరే ముఖంలోకి ఇంజెక్ట్ చేసినట్లు అవుతుంది.

ఈకంగా రెండు రకాల ప్రమాదాలు ఉన్నాయి మొటమలను గిల్లడం వలన.మొటిమను అలానే వదిలేస్తే ఓ వారంలో వెళ్ళిపోతుంది.కాని గిల్లితే మాత్రం దాని తాలూకు మచ్చ లేదా రంధ్రం చాలాకాలం అలానే ఉండిపోతుంది.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు