ఈ అభిమానులకి రికార్డుల పిచ్చి ఎప్పుడు వదులుతుందో ఏమో.బ్యానర్స్ కడతారు, పాలాభిషేకాలు చేస్తారు, బాణసంచా కాలుస్తారు, ఇంకా రకరకాలుగా సంబరాలు చేస్తారు అభిమాన హీరో సినిమా విడుదలైతే.
సరే, సంవత్సరానికి వచ్చేది ఒకటే సినిమా కదా.ఆ మాత్రం హడావుడి ఉంటుంది అభిమాన హీరో అని అనుకోవచ్చు.సినిమా విడుదలై, ఫ్లాప్ అయ్యాక కూడా అదే వెర్రిలో ఉంటే ఎలా?
విజయవాడలో ఇప్పటివరకు మహేష్ తీసిన 21 సినిమాలు అన్నీ 50 రోజులు ఆడాయి.అప్పట్లో ఫ్లాపులుగా నిలిచిన వంశీ, బాబి, సైనికుడు,ఖలేజా వంటి చిత్రాలను, ఈ మధ్య భారి డిజాస్టర్లుగా నిలిచిన 1-నేనొక్కడినే, ఆగడు వంటి చిత్రాలను కూడా 50 రోజులు ఆడించారు అభిమానులు.
ఈ లెక్కన మహేష్ బాబు సినిమాల్లో ఒక్కటి కూడా 50 రోజులు మిస్ అవలేదు విజయవాడలో.ఇదో రికార్డు.
ఈ సినిమాలన్ని ఒక ఎత్తైతే, బ్రహ్మోత్సవం మరొక ఎత్తు.గట్టిగా చెప్పాలంటే, మహేష్ కెరీర్లో జనాలు ఇంత దారుణంగా ఏ సినిమాని రిజక్ట్ చేయలేదు.
థియేటర్ కి రెంటు డబ్బులు కూడా రావడం లేదు.పరిస్థితి ఇలా ఉంటే 50 రోజుల రికార్డు మిస్ అవకూడదని, మహేష్ అడ్డాగా చెప్పుకునే అలంకార్ థియేటర్లో బ్రహ్మోత్సవం చిత్రాన్ని కూడా 50 రోజులు ఆడించబోతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.
ఈరోజుల్లో అనవసరమైన ఈ రికార్డుకి లక్షల్లో ఖర్చు .అయినా పిచ్చి తగ్గట్లేదు.







