బినామిని వాడుకున్న అల్లు అరవింద్?

సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలోనే కబాలిగా మనముందుకి రాబోతున్నారు.పీ.

 Allu Aravind Used Benami For Buying Kabali Telugu Rights?-TeluguStop.com

ఏ రంజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధిక ఆప్టే కథానాయికగా నటించింది.రజినీకాంత్ సినిమాలకు సహజంగా ఉండే అంచనాలే ఈ సినిమాకి ఉండటంతో తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఏర్పడింది సినిమాకి.

అందుకే తెలుగులో బిజినెస్ భారి ఎత్తున జరిగింది.

షణ్ముఖ ఫిలిమ్స్ కి చెందిన ప్రవీణ్, కేపి చౌదరి ఈ చిత్ర హక్కులని 32 కోట్లకు దక్కించుకున్నారని సమాచారం.

ఇక ఫిలీంనగర్ లో కొత్తగా వినబడుతున్న వార్తలు ఏమిటంటే, ఈ హక్కుల్లో గీతా ఆర్ట్స్ కి కూడా ఓ భాగం ఉందట.ఇది ఒకవైపు.అలా కూడా కాదు, నిర్మాత అల్లు అరవింద్ తన బినామిని ఉపయోగించి ఈ హక్కులను పూర్తిగా తీసుకున్నారని మరోవైపు జోరుగా ప్రచారం జరుగుతోంది.నిజానిజాలు ఏంటో బయటకి మాత్రం స్పష్టంగా తెలియదు.

ఈ విషయాలన్ని పక్కనపెడితే, 32 కోట్ల డీల్ లో సాటిలైట్ రైట్స్ కూడా ఉండటం విశేషం.ఇక ఈ సినిమా జులై 1న భారి ఎత్తున విడుదల కాబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube