దేవునికి కొబ్బరికాయ ఎందుకు కొడతారు?

శుభకార్యాల్లోనూ, దేవుణ్ణి పూజించే సమయంలోను, యజ్ఞాలు,యాగాలు చేసే సమయంలో కొబ్బరికాయ కొట్టటం సాధారణమే.అయితే కొబ్బరికాయను అసలు ఎందుకు కొట్టాలి? ఇప్పుడు ఆ విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.

కొబ్బరి కాయ మీద ఉన్న పెంకు మన అహంకారానికి గుర్తు.

ఎప్పుడైతే మనం దేవుని ముందు కొబ్బరికాయ కొడతామో మన అహంకారం తొలగిపోతుంది.అలాగే లోపల ఉన్న కొబ్బరి వలె మన మనస్సు స్వచ్ఛంగా ఉందని, కొబ్బరినీరు వలే జీవితాన్ని నిర్మలంగా ఉంచామని భగవంతుణ్ణి కొరటమే కొబ్బరికాయ కొట్టటంలో పరమార్ధం.

కొబ్బరికాయను మన శరీరానికి అన్వయిస్తే.కొబ్బరికాయ మీద ఉన్న చర్మం మన చర్మం, పీచు మనలోని మాంసం, పెంకు ఎముకలు,కొబ్బరి ధాతువు,కొబ్బరినీరు మన ప్రాణాధారం.అలాగే కొబ్బరికాయ పైన ఉన్న మూడు కళ్ళు ఇడ, పింగళి,సుషుమ్న నాడులు.

అందువల్లే మనం దేవుని ముందు కొబ్బరికాయ కొడతాం.

Advertisement
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు