విద్యార్థులకు సోనుసూద్ ఆఫర్.తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
లాక్ డౌన్ లో ఎంతో మందికి సోనుసూద్ ఆపద్బాంధవుడిలా మారారు.ప్రస్తుతం సోనూసూద్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
రీల్ లైఫ్ లో విలన్ అయినా.రియల్ లైఫ్ లో హీరో గా జనాలు గుండెల్లో నిలిచిపోయారు సోనుసూద్.
కరోనా టైం లో చాలామందికి ఏం కావాలంటే అది సోనూసూద్ సహాయం చేశారు.విపత్తు సమయంలో సోనుసూద్ చేసిన సేవా కార్యక్రమాలకు అభినందనలతో పాటుగా పలు అవార్డులు ఆయనకు దక్కాయి.
తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.విద్యార్థుల కోసం హీరో సోనుసూద్ కొత్త ఆఫర్ ప్రకటించారు.
యూనివర్సల్ ఎడ్యుకేషన్ సహకారంతో.సూద్ ఛారిటీ పౌండేషన్ తరపున ముంబైలో ఇంటర్, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఎల్.ఎల్.బి, బి.ఇడి, ఆర్కిటెక్చర్ ఇలాంటి కోర్సులను ఉచితంగా అందిస్తామని సూద్ ఛారిటీ పౌండేషన్ తెలిపారు.ఇందుకోసం దేశంలో ఎవరైనా https://Soodcharityfoundation.org/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు.సోనూసూద్ ఇప్పటికే సీఏ, లా కోర్సులు ఉచితంగా అందిస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నారు సోనుసూద్.
సాయం పొందిన ప్రతి ఒక్కరూ సోనుసూద్ ను దేవుడుగా పూజిస్తున్నారు.