ఆ అద్బుతమైన మూవ్‌మెంట్‌ ను ఫోటోలో బంధించడంతో ఫోటోగ్రాఫర్ జీతం పెంచిన ఆర్సిబి..!

ఫోటోలు తీయడం ఒక కళ.చాలా మందికి ఫోటోలు తీయడమంటే ఆనందం.

జీవితంలో దాన్ని ఒక భాగంగా చూసేవారు కూడా ఉన్నారు.

వెయ్యి మంది మాట్లాడే తీరు ఒక్క ఫోటో చూస్తే సరిపోతుంది.

ఫోటోకు ఉన్న గొప్పతనం అలాంటిది.అయితే ఈ ఫోటోలు తీయడం అంత సులభం కాదు.

మారుతున్న కాలానికి అనుగుణంగా అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి.అందుకే అందరూ తమ జీవితంలోని విలువైన క్షణాలను ఫోటోల్లో బంధిస్తున్నారు.

Advertisement

పెళ్లిళ్లు, బారసాల, పండగలు, విహార యాత్రలు, తీర్థయాత్రలు.ఇలా చాలా ఘట్టాలను స్మార్ట్ ఫోన్లలో బంధించి భద్రంగా దాచుకుంటున్నారు.

అయితే ఫోటోలు తీయడమే జీవనోపాధిగా పెట్టుకున్న ఫోటోగ్రాఫర్లకు దీనివల్ల కొంత నష్టం వాటిల్లుతోంది.అద్బుతమైన మూవ్‌మెంట్‌ను పట్టుకోవడం ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌కే చాలా కష్టంగా మారుతుంది.

ఫోటోగ్రఫీలో స్పోర్ట్స్ ఫొటో గ్రఫీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది.మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడే అద్భుతమైన క్షణాలను ఫోటో తీయాల్సి ఉంటుంది.

క్రీడలలో రీటేక్స్, స్టిల్స్ ఉండవు.అంతా మ్యాచ్ జరుగుతున్నప్పుడే ఫోటోలు తీయాల్సి ఉంటుంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

అందుకే స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.తాజాగా ఓ ఫోటో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫొటోగ్రాఫర్‌కు ఆ జట్టు యాజమాన్యం జీతం పెంచేలా చేసింది.

Advertisement

కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫేవరెట్ షాట్ కవర్ డ్రైవ్‌ను పర్ఫెక్ట్‌గా ఫోటో తీసినందుకు ఆ ఫోటోగ్రాఫర్ కు జీతం పెంచినట్లు ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది.కోహ్లీ ప్రాక్టీస్ చేసే సమయంలో కవర్ డ్రైవ్ ఆడుతుండగా దూరంగా ఉన్న ఫొటోగ్రాఫర్ దాన్ని చిత్రీకరించాడు.

పర్ఫెక్ట్ స్టిల్ ఫొటోగ్రఫిలా అనిపిస్తున్నప్పటికీ అది లైవ్ ఫొటో అని చాలా మంది ప్రసంశలు కురిపించారు.అందుకే ఆ ఫొటోగ్రాఫర్ జీతం పెంచినట్లు సమాచారం.

ఆర్సీబీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ ఫొటో పోస్టు అయ్యింది.ముంబై లోని సీసీఐ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆ పొటో తీసినట్లు సమాచారం.

కరోనా ఆంక్షల కారణంగా ఒక జట్టు వాంఖడేలో ప్రాక్టీస్ చేస్తుంటే మరో జట్టు సీసీఐలో ప్రాక్టీస్ చేస్తున్నది.ఆదివారం చెన్నైతో జరుగనున్న మ్యాచ్ నేపథ్యంలోనే కోహ్లీ సేన ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆ ఫొటో తీసి నట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఫోటోగ్రాఫర్ కష్టం ఎక్కడికిపోలేదు.అతనికి ప్రసంశల జల్లు కురిసేలా చేసింది.

తాజా వార్తలు