అనంతపురము, రాయదుర్గం: రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి( MLA Kapu Ramachandra Reddy ) సంచలన కామెంట్స్.అధిష్టానం పెద్దలు నాతో సంప్రదింపులు చేస్తున్నారు.
అసెంబ్లీలో సీఎం జగన్( CM Jagan ) స్వయంగా మాట్లాడించారు.కోపం తగ్గిందా అన్నా అని అడిగారు.
తర్వాత వచ్చి కలవమన్నారు.మా ఇంట్లో పూజ కార్యక్రమాలు ఉన్నందున నేను వెళ్లలేదు.
ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు.గతంలో నాకు కళ్యాణదుర్గం టికెట్ ఇస్తామని చెప్పారు.రాయదుర్గంలో గెలిపించే బాధ్యత కూడా నాకు ఇచ్చారు.కానీ హఠాత్తుగా రంగయ్యకు( Rangaiah ) కళ్యాణదుర్గం టికెట్ ప్రకటించారు.
నేను దాచాల్సింది ఏమీ లేదు… త్వరలో అధిష్టానాన్ని కలుస్తాను.