ఫ్యాషన్ రంగం( Fashion )లో క్రియేటివిటీ ఎంతైనా చూపించవచ్చు.ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్స్ కొన్ని బట్టలు, బ్యాగులు, తదితర వస్తువులతో క్రియేటివిటీని వేరే లెవల్‌కి తీసుకెళ్లారు.
కొన్నిసార్లు వారు చేసే కొత్త డిజైన్లు చాలా చిత్రంగా అనిపిస్తాయి.నిజంగా ఫ్యాషన్ అంటే ఏంటి? ఇలాంటి విచిత్రమైనవి తయారు చేసే ప్రజల మీద వదిలేయడమేనా అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు.అలాంటి డిజైన్‌లలో ఒకటి ర్యాట్ కేజ్ బూట్స్( Rat Cage Boots ).ఈ బూట్లు విచిత్రమైనవే కానీ కళ్లు చెదిరేలా ఉంటాయి.ఈ బూట్ల కింద బోనులు, వాటి లోపల ఫేక్ ఎలుకలు ఉన్నాయి.న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఈ బూట్లు బాగా పాపులర్ అయ్యాయి.
ఈవెంట్‌లో ఈ బూట్లను జెన్నీ అసాఫ్ అనే మోడల్, స్టైలిస్ట్ ధరించి కనిపించింది.ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ అయిన ది బ్లోండ్స్ షోలో ఆమె ముందు వరుసలో కూర్చుంది.
చాలా మంది ఆమె బూట్లను గమనించి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
బూట్లను “అన్‌కామన్ క్రియేటివ్ స్టూడియో”( Uncommon Creative Studio ) తయారు చేసింది.ఈ కంపెనీకి లండన్‌లో, న్యూయార్క్‌లో మరొక కార్యాలయం ఉంది.న్యూ యార్క్( New York )లో పాపులర్ అయ్యేందుకు ఇది ఈ బూట్లు తీసుకొచ్చింది.
అన్‌కామన్ కంపెనీ బాస్ సామ్ షెపర్డ్ మాట్లాడుతూ ఈ బూట్ల ఆలోచన మొదట్లో చాలా సిల్లీగా ఉండేదన్నాడు.అయితే ఇది తమ ప్రాజెక్ట్‌కి సరైన ఆలోచన అని కూడా చెప్పాడు.
అతను GLOSSY అనే మ్యాగజైన్‌తో మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా న్యూయార్క్ బూట్‌ను తయారు చేయాలనుకుంటున్నామని వెల్లడించాడు.
ఫ్యాషన్ ఈవెంట్‌లో బూట్లు( Rat Cage Heels ) చాలామంది దృష్టిని ఆకర్షించాయి.ఆ బూట్లను వీడియో తీసి సోషల్ మీడియా( Social Media ) యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అప్‌లోడ్ చేశారు.ఈ వీడియోకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.
బూట్ల గురించి ప్రజలు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు.కొంతమంది వాటిని ఇష్టపడ్డారు, కొంతమంది వాటిని అసహ్యించుకున్నారు.