మేడ్చల్ పట్టణంలో తూతూ మంత్రంగా జరిగిన రాస్తా రోఖో ...

కేంద్రలోని బిజెపి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మేడ్చల్ జాతీయ రహదారిపై రాస్తారోకో కార్యక్రమం ఉప్పచప్పగా జరిగింది.

తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బిజెపి సర్కార్ వైఖరికి నిరసనగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు కెసిఆర్ ఆదేశానుసారం తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మేడ్చల్ మండలం లో పెద్దగా స్పందన లేక పోవడం తో కార్మిక శాఖ మంత్రి గైర్హాజరు.

ఓ వైపు సీఎం కేసీఆర్ కేంద్రం పై కత్తులు దూస్తూ వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఢిల్లీలో కూడా పోరాటం చేస్తుండగా మేడ్చల్ లో మాత్రం తె.రా.స శ్రేణులు ఆందోళన కార్యక్రమాల ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విపలమౌతున్నారు.ధాన్యం కొనుగోలు పై ఆందోళన లో భాగంగా జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో తె.రా.స శ్రేణులు పెద్దగా పాల్గొనక పోవడంతో తూ తూ మాత్రంగానే నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి పాల్గొనే నియోజకవర్గ కార్యక్రమంలో తె.రా.స నాయకులు ఎక్కువగా హాజరు కాకపోవడం పలు విమర్శలకు దారి తీసింది.రైతుల పట్ల TRS నాయకులు సవతి ప్రేమ చూపిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

తాజా వార్తలు