ప్రతిరోజూ అది కచ్చితంగా చేయాల్సిందే అంటున్న రష్మిక..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఛలో సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టిన రష్మిక మందాన అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది ఈవిడ.

గత కొన్ని రోజులుగా ఆవిడకు సంబంధించిన వర్కౌట్స్ వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నానా హంగామా చేస్తోంది.తాజాగా మరో వీడియోను ఆవిడ తన ఇంస్టాగ్రామ్ తద్వారా షేర్ చేసి అభిమానులను అలరించింది.

అయితే ఇది వరకు తాను ఒకసారి ఆమ్లెట్ గురించి ఓ పోస్ట్ చేయగా అప్పటినుంచి ఆమెను తన ఫ్రెండ్స్ ఆమ్లెట్ కు సంబంధించి వీడియో చేయమని అడుగుతున్నారని.అయితే అందుకు సంబంధించి తాను ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తానో తెలుపుతూ ఓ వీడియో షేర్ చేయండి.

అయితే రష్మిక వేసిన ఆమ్లెట్ చూస్తే అమాంతం నోట్లో ఇట్లే పెట్టుకోవాలని అనిపించేంతగా రెడీ చేసింది రష్మిక.ఈ నేపథ్యంలోనే రష్మిక మందాన సీక్రెట్ ను ఒకటి బయట పెట్టింది.

Advertisement

అదేమిటంటే తాను ప్రతిరోజు కచ్చితంగా తానే ఆమ్లెట్ తయారు చేసుకొని తింటున్నట్లు తెలిపింది.

అంతే కాదు ప్రతి రోజు కచ్చితంగా ఆమ్లెట్ ను తినాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ.వీడియో లో మై ఎవ్రీడే ఆమ్లెట్ అని చెబుతూ.మీరు కూడా ట్రై చేయండి అంటూ తెలిపింది.

నేను చేసిన స్టైల్ లోనే మీరు కూడా ఆమ్లెట్ ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా తెలపండి అంటూ రష్మిక తెలియజేసింది.ఏదైనా ఫ్యూచర్ లో రష్మిక ను పెళ్లి చేసుకున్న వాడు మాత్రం లక్కీ అని చెప్పవచ్చు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూసి ఆమ్లెట్ ఎలా వేయాలో నేర్చుకోండి.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు