ధోనీకి అరుదైన గౌర‌వం.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌..

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఆయ‌న ఇమేజ్ ప్ర‌పంచ వ్యాప్తంగా పెరిగింద‌నే చెప్పాలి.

కాగా ఆయ‌న ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు మహేంద్రసింగ్ ధోని.అయితే ఆయ‌న‌కు ఇప్పుడు ఓ అరుదైన గౌరవం దక్కడంతో ఆయ‌న అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.

ఇప్ప‌టికే ధోనీకి ఎన్నో ప‌దవులు వ‌చ్చాయి.కాగా ఆయ‌నకు ఇప్పుడు మ‌రో ప‌ద‌వి ద‌క్కింది.

అదేంటంటే మిలటరీ లోని గౌరవ లెఫ్ట్ నెంట్ పదవిని ధోనీకి అప్ప‌గించారు అధికారులు.అయితే 2011లోనే ఇండియన్ ఆర్మీలో గౌరవ ర్యాంకు సంపాదించుకున్న ఎం.ఎస్‌.ధోని పారాచూట్ రెజిమెంట్ లో లెఫ్ట్ నెంట్ కల్నల్ గా అప్ప‌టి నుంచే బాధ్యతలు తీసుకుని త‌న వంతుగా వాటిని నిర్వ‌హిస్తున్నారు ధోనీ.

Advertisement

కాగా ఇప్పుడు ధోనికి మరో గౌర‌వ ప్ర‌ద‌మైన స్థాయి ద‌క్కింది.అదేంటంటే నేషనల్ క్యాడెట్ క్రాప్స్ రివ్యూ చేసేట‌టువంటి 15 మంది డిఫెన్స్ మినిస్టర్స్ కమిటీ విభాగంలో ధోనికి చోటు ఇచ్చి ఆయ‌న్ను ఎంతో గౌర‌వించారు అధికారులు.

దీంతో ఈ విష‌యం తెలుసుకున్న అభిమానులు పండుగ చేసుకుంటున్నార‌నే చెప్పాలి.

అయితే ఈ క‌మిటీలో ఎవ‌రికి ప‌డితే వారికి అంత ఈజీగా ప్లేస్ ద‌క్క‌డం కుద‌ర‌దు.కానీ ధోనీకి మాత్రం ఇలా ద‌క్క‌డంతో ఆయ‌న అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.ఎన్ సీసీ సమగ్ర సమీక్ష నిర్వహించే క్ర‌మంలో దేశ భ‌ద్ర‌త‌ల అవసరాలకు అనుగుణంగా ఈ కమిటీని గ‌తంలో ఏర్పాటు చేసింది మ‌న జాతీయ మిలటరీ విభాగం సెక్ష‌న్ హ‌య్య‌ర్ ఆఫీస‌ర్లు.

ఇలాంటి అరుదైన క‌మిటీలో ధోనికి స్థానం ద‌క్క‌డం చాలా గొప్ప విషంయ అని చెబుతున్నారు.అయితే ఈ అరుదైన క‌మిటీలో ధోనీతో పాటు ఆనంద్ మహీంద్రా, కేంద్రమాజీ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ లాంటి ప్ర‌ముఖులు ఉండ‌టం విశేషం.

వీధి ఆవులకు రొట్టెలు పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు