వామ్మో.. యానిమల్ టికెట్ రేటు ఏకంగా 2400 రూపాయలా.. బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే?

రణ్ బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యానిమల్ సినిమాపై( Animal Movie ) అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా అన్ని ప్రధాన నగరాల్లో యానిమల్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి.

ఇప్పటికే రిలీజైన యానిమల్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో యానిమల్ ఫస్ట్ డే కలెక్షన్లు కూడా భారీ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది.

అర్జున్ రెడ్డి డైరెక్టర్ మూవీ కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఒకింత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.అయితే యానిమల్ మూవీ టికెట్ రేట్లు( Animal Ticket Rates ) భారీ స్థాయిలో ఉంది.

ఫస్ట్ డే ఈ సినిమాను చూడాలంటే మాత్రం ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.ఢిల్లీలో యానిమల్ మూవీ టికెట్ రేటు ఏకంగా 2400 రూపాయలుగా ఉండటం గమనార్హం.

ఢిల్లీలోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్ స్క్రీన్ లో రీ క్లెయినర్ సీటులో యానిమల్ సినిమాను చూడాలని భావించే వాళ్లు ఏకంగా ఈ రేంజ్ లో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Ranbir Kapoor Animal Movie Ticket Prices Details, Animal Movie, Ranbir Kapoor, R
Advertisement
Ranbir Kapoor Animal Movie Ticket Prices Details, Animal Movie, Ranbir Kapoor, R

ముంబాయిలో( Mumbai ) యానిమల్ టికెట్ రేటు గరిష్టంగా 2000 రూపాయల వరకు ఉండటం గమనార్హం.ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుని మేకర్స్ టికెట్ రేట్లను పెంచారని సమాచారం అందుతోంది.తెలుగు రాష్ట్రాల్లో మాత్రం యానిమల్ మూవీ టికెట్ రేట్లు పరిమితంగానే ఉన్నాయని సమాచారం అందుతోంది.

యానిమల్ బుకింగ్స్ యావరేజ్ గా ఉండగా ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

Ranbir Kapoor Animal Movie Ticket Prices Details, Animal Movie, Ranbir Kapoor, R

యానిమల్ సినిమా సక్సెస్ సాధించి బాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం దక్కుతుందేమో చూడాల్సి ఉంది.యానిమల్ సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చుడాల్సి ఉంది.యానిమల్ సినిమాతో రణ్ బీర్ కపూర్( Ranbir Kapoor ) పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) దర్శకుడిగా స్థాయిని పెంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు