ఆ కిక్కే వేరు బ్రదర్...ఫ్యాన్ అత్యుత్సాహం పై పంచ్ వేసిన రానా?

దగ్గుబాటి రానా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

 Rana Punch On A Fan Comment Over Virataparvam Poster Details, Rana, Tollywood,-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమాను ఈ నెల 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సిద్ధమయ్యారు.ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం ట్రైలర్ విడుదల తేదీని ప్రకటిస్తూ ట్విట్టర్ వేదికగా సురేష్ ప్రొడక్షన్స్ అధికారకంగా ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం పలు చర్చలకు దారి తీసింది.

ఇందులో రానా సాయి పల్లవి హత్తుకునేటట్లు కనిపిస్తున్నప్పటికీ రానా మొహం మాత్రం కనబడదు.రానా ఫేస్ కనపడకుండా మేకర్స్ ఈ పోస్టర్ డిజైన్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ పోస్టర్ పై పలువురు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.

Telugu Venu Udugula, Sai Pallavi, Rana, Rana Daggubati, Rana Punch Fan, Suresh,

సొంత నిర్మాణ సంస్థ వారే మీ ఫేస్ తీసేసారు ఇతరులు మీ పాత్రలను వేలెత్తి చూపడంలో తప్పేముంది.తక్కువ నిడివి ఉన్న పాత్రలు చేయడం, అందరికీ లోకువ కావడం రానా స్టైల్ అంటూ ఈ పోస్టర్ పై ఒక నెటిజన్ కామెంట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ కామెంట్ పై స్పందించిన రానా తనదైన శైలిలో సదరు నెటిజన్ కి పంచ్ వేశాడు.

మనం తగ్గి కథను, నాయికను ఎలివేట్ చేయడంలో ఉండే కిక్కే వేరు బ్రదర్ రిప్లై ఇవ్వడమే కాకుండా సొంత బ్యానర్ కదా అని గొప్పవన్నీ ఇక్కడే చేయొచ్చు అంటూ రానా దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube