లెజెండరీ నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆయన నటించిన విక్రమ్ సినిమా ఇటీవల విడుదల అయ్యింది.
ఈ సినిమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది.కమల్ హాసన్ నాలుగున్నర సంవత్సరాల తర్వాత నటించిన ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటులు కూడా నటించారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు.మరొక తమిళ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.
అనిరుధ్ ఈ సినిమాకి అందించిన సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా.
ప్రముఖ కోలీవుడ్ నటుడు సూర్య కమల్ హాసన్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు.విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ తో పాటు నటించిన సూర్య ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఈ క్రమంలో సూర్య సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టు షేర్ చేశాడు.అందులో.
ప్రియమైన కమల్ హాసన్ అన్న.మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు.విక్రమ్ సినిమా ద్వార నా కల నెరవేరింది.ఇందుకు కారణమైన లోకేష్ కనగరాజ్‌కి నా ధన్యవాదాలు.నాపై ప్రేక్షకులు కనబరుస్తున్న ప్రేమకి నాకు చాలా గర్వంగా ఉంది” అంటూ సూర్య ట్వీట్ చేశాడు.

సూర్య ట్వీట్ కి కమల్ హాసన్ స్పందించాడు.ఈ క్రమంలో కమల్ ట్వీట్ చేస్తూ.” ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.ఇప్పటికే చాలా ప్రేమ ఉంది.
జనాభా పెరగటంతో ఆ ప్రేమ మరింత ఎక్కువయ్యింది.అంటూ సూర్య ఫ్యూచర్ కి కమల్ హాసన్ అల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ క్రమంలో కమల్ హాసన్ సూర్యని తంబి సార్ అని సంబోధించడం విశేషం.కమల్ ట్వీట్ కి సూర్య స్పందిస్తూ.
పెద్దన్నయ్య అంటూ నవుతున్న ఎమోజీని పెట్టాడు.వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది.
ప్రస్తుతం ఈ పోస్టులు సోషియల్ మీడియాలో వైరల్ గా మారాయి.







