దృశ్యం 2 సినిమాలో తాను నటిస్తున్నట్లు వచ్చిన వార్తలపై రానా క్లారిటీ

విక్టరీ వెంకటేష్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం2 మూవీ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఫ్యామిలీ థ్రిల్లర్ గా ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపొయింది. జూన్, జులైలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన దృశ్యం 2 ఒరిజినల్ వెర్షన్ ని కూడా దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేసేశాడు.ఇప్పుడు వెంకటేష్ తో చేస్తున్న రీమేక్ కూడా అదే స్థాయిలో స్పీడ్ గా ఫినిష్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొదటి భాగంలో ఉన్న పాత్రలనే కొనసాగిస్తున్నాడు.కొత్తగా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రని దర్శకుడు పరిచయం చేశాడు.

Advertisement

ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ పాత్రని తెలుగులో రానా చేయబోతున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తుంది.రానాతో పాటు సమంత కూడా కీలక పాత్రలో కనిపించబోతుందని టాక్ వినిపించింది.

అయితే తాజాగా దగ్గుబాటి రానా దృశ్యం 2 రీమేక్ విషయంలో వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చేశాడు.ఆ సినిమాలో తాను నటించడం లేదని తేల్చి చెప్పేశాడు.

ప్రచారం జరుగుతున్న దాంట్లో అసలు వాస్తవం లేదని స్పష్టం చేసేశాడు.ఇదిలా ఉంటే రానా నటించిన అరణ్య మూవీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా నక్సలైట్ నాయకుడుగా చేస్తున్న విరాటపర్వం సినిమా షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు