పిల్లలను టార్గెట్ చేసిన హీరో.. నోరెళ్లబెట్టిన ఆడియెన్స్!

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి నటించిన తాజా చిత్రం ‘అరణ్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.

అయితే ఈ సినిమా రిలీజ్ చేద్దామనుకునే సమయానికి కరోనా వైరస్ ప్రబలగా లాక్‌డౌన్ విధించడంతో సినిమా థియేటర్లు మూతపడ్డాయి.

దీంతో ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేయలేకపోయారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రానా రెడీ చేశాడు.

తన నెక్ట్స్ మూవీ విరాటపర్వం కూడా వైవిధ్యమైన కథతో వస్తుందంటూ చెబుతున్న రానా, నిర్మాతగా మారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇటీవల ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసిన రానా, మంచి విజయాన్ని అందుకున్నాడు.

కాగా మరిన్ని సినిమాలను నిర్మించాలని రానా భావిస్తున్నాడు.ఇందులో భాగంగా చిన్న పిల్లలు ఎంతో ఇష్టపడే యానిమేషన్ చిత్రాలను నిర్మించాలని రానా ప్లాన్ చేస్తున్నాడు.

Advertisement

ఈ సినిమాలను వచ్చే యేడు పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు.కాగా ప్రస్తుతం హీరోగా మరో రెండు సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు రానా.

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను తెలుగులో రీమేక్ చేస్తుండగా, అందులో ఓ హీరోగా నటిస్తున్న రానా, అటు దర్శకుడు గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హిరణ్యకశిప’లో మెయిన్ లీడ్‌లో నటించనున్నాడు.మరి హీరోగా మెప్పించిన రానా చిన్నపిల్లల సినిమాలతో నిర్మాతగా ఎంతమేర మెప్పిస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు