రైతుగా ఉన్న రామోజీ రూ.వేల కోట్ల అధిపతిగా ఎలా ఎదిగాడో తెలుసా?

ఒక భారతీయ వ్యాపారవేత్త నడుగు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు.తెలుగు దినపత్రిక ఈనాడు స్థాపకులు.

మార్గదర్శి ప్రియా ఫుడ్స్ వంటి సంస్థల అధినేత.ఆయన స్థాపించిన రామోజీ ఫిలిం సిటీ అది పెద్ద సినిమా స్టూడియోగా వర్ధిల్లుతోంది.

రామోజీ రావు కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామానికి చెందిన మధ్యతరగతి రైతు కుటుంబంలో 1936 నవంబర్ 16న చెరుకూరి వెంకట సుబ్బారావు వెంకట సుబ్బమ్మ అనే దంపతులకు ఈయన జన్మించారు.ఆయనతో పాటు రాజలక్ష్మి రంగనాయకమ్మ అనే ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు.గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ బీఎస్సీ పూర్తి చేశారు అనంతరం ఢిల్లీలోని ఒక యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ గా చేరారు.1961లో తాతినేని రమాదేవి తో వివాహం జరిగింది.62 లో హైదరాబాద్లో స్థిరపడి, 62 అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ను స్థాపించారు.65 లో కిరణ్ యాడ్స్ ను ప్రారంభించి, 67 నుంచి 69 వరకు ఖమ్మంలో కిరణ్ ఫెర్టి లైజర్స్ ను స్థాపించి, 69 లు అన్నదాత పత్రిక స్థాపించారు.అదేవిధంగా 1970లో ఇమేజెస్ advertising ఏజెన్సీని ప్రారంభించారు.72 నుంచి 73 వరకు విశాఖపట్నం డాల్ఫిన్ హోటల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.74 లో విశాఖ ఈనాడు దినపత్రిక ప్రారంభించారు.75 డిసెంబర్ 17న ఈనాడు ఎడిషన్ ప్రారంభమయింది.అదేవిధంగా 76 లో సినీ ప్రేమికుల కోసం సీతార పరిచయం చేశారు.

78 ఫిబ్రవరి లో చతుర విపుల ను ప్రారంభించి, 80 లో ప్రియా ఫుడ్స్, 83 లో ఉషాకిరణ్ మూవీస్ ఏర్పాటు చేశారు.1990లో ఈనాడు జర్నలిజం స్కూలును ప్రారంభించారు.92 నుంచి 93 వరకు సారాపై సమరం మద్యపాన నిషేధం కోసం పోరాటం చేశారు.1996లో ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రనగరి రామోజీ ఫిలిం సిటీ ని స్థాపించి మరో మెట్టుకు ఎదిగారు.2002లో లో ఈ టీవీ లో ఆరు ప్రాంతీయ ఛానల్స్, రమాదేవి పబ్లిక్ స్కూల్, 2008 లో సమాచార హక్కు చట్టం కోసం ముందడుగు, 2014లో స్వచ్ఛభారత్ కోసం మోదీ చేత నామినేట్ చేయబడ్డారు.అదేవిధంగా 2015లో మరో నాలుగు ఈ టీవీ ఛానల్స్ ను ఆరంభించారు.

Advertisement

దీంతోపాటు పాత్రికేయ రంగంలో చేసిన విశేష సేవలకు గాను రామోజీరావుకు పద్మవిభూషణ్ ను ప్రభుత్వం ప్రకటించింది.విశ్వసనీయ సమాచారానికి వేదికను తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి రామోజీరావు.ఆయన మదిలో మొగ్గ తొడిగిన ఎన్నో సంస్థలు నేడు ప్రగతి దారిలో దూసుకుపోతున్నాయి.

ఆయనకు మాతృభాష అంటే ఎనలేని ప్రీతి.అమ్మ భాష అంతరించిపోకుండా అరచేతులు అడ్డుపెట్టి తల్లిపాల రుణం తీర్చుకునేందుకు తెలుగు వెలుగు పత్రిక నుంచి మరో ఖ్యాతిని అందిపుచ్చుకున్నారు రామోజీ రావు.

రామోజీరావు కృషి అసాధారణం.ఆయన దీక్ష దక్షతలు అద్వితీయం.కాబట్టి ప్రతిష్టాత్మక సంస్థలు ఆయనకు పురస్కారాలను అందించాయి.1986 లో ఆయనకు విశ్వకళాపరిషత్ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని, 89 లో వెంకటేశ్వర విద్యాలయం గౌరవ డాక్టరేట్ ను అందజేశాయి.ఇలా ఆయనకు ఎన్నో పురస్కారాలు వచ్చినా మీ సత్కారాలు అందించినా సాధించిన దానితో ఆయన ఎప్పుడూ పొంగిపోలేదు.

సంతృప్తి చెందలేదు ఇంకా ఏదో సాధించాలనే తపన ఆయనది నిరంతరం పనిలోనే విశ్రాంతిని ఎంచుకొనే ఆయనకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ సంస్కారాన్ని అందించడం ఆయన ఎనలేని కృషికి నిదర్శనం.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు