రమేష్ ఆస్పత్రి అనుమతులు రద్దు : ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం ఓ కార్పొరేట్ ఆస్పత్రిపై వేటు వేసింది.గత కొద్ది రోజుల కిందట కోవిడ్ సెంటర్ గా కొనసాగుతున్న ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది.

ప్రమాదంలో 10 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

వెంటనే ఆ ప్రైవేట్ ఆస్పత్రికి సంబంధించి కరోనా చికిత్స అనుమతులను రద్దు చేసింది.స్వర్ణ ప్యాలెస్ లో రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చి బాధితులకు చికిత్సను అందిస్తోంది.

చికిత్స పొందుతున్న సమయంలో అక్కడ అగ్నిప్రమాదం సంభవించింది.డాక్టర్లతో కలపి అక్కడ 40 మంది ఉన్నారు.

Advertisement

మంటలు చెలరేగడంతో కొందరు బాధితులు కిటికీలు పగలగొట్టుకుని బయటకు దూకగా మరి కొందరు పరిగెత్తుకుని బయటకు వచ్చారు.ప్రమాదంలో 10 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ప్రభుత్వం రమేష్ ఆస్పత్రికి షాకింగ్ వార్తను అందించింది.నిబంధనలకు వ్యతిరేకంగా కోవిడ్ కేర్ సెంటర్ ను పెట్టడమే కాకుండా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదని గుర్తించారు.

దీంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్ అనుమతిని రద్దు చేశాడు.కరోనా బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేశారని రిపోర్టుల్లో పేర్కొన్నారు.

ఈ మేరకు ఉత్తర్వులు త్వరలోనే అమలులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు