చిరు 45 ఏళ్ల జర్నీ పై ఎమోషనల్ పోస్ట్ చేసిన రామ్ చరణ్!

సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు చిరంజీవి( Chiranjeevi ) ఒకరు.

నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి ఎవరి సపోర్ట్ లేకుండా నేడు ఇండస్ట్రీలో ఉన్నత స్థానంలో ఉన్నారు.

ఇక ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సెప్టెంబర్ 22వ తేదీకి 45 సంవత్సరాలు పూర్తి కావడంతో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ( Ramcharan ) సోషల్ మీడియా వేదికగా తన తండ్రి సినీ జర్నీ గురించి తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Ramcharan Emotional Post On Chiru 45 Years Cini Journey , Chiranjeevi, Ramcharan

చిరంజీవి నటించిన మొట్టమొదటి చిత్రం ప్రాణం ఖరీదు ఈ సినిమా సెప్టెంబర్ 22వ తేదీ నాటికి విడుదల అయ్యి 45 సంవత్సరాలు పూర్తి కావడంతో రామ్ చరణ్ సైతం తన తండ్రి గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.సినీ పరిశ్రమలో 45 సంవత్సరాలు మెగా జర్నీ( Mega Journey ) పూర్తి చేసుకున్నటువంటి మన ప్రియమైన మెగాస్టార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.ఆయన ప్రయాణం ఎంతో గొప్పది.

ప్రాణం ఖరీదు సినిమాతో ప్రారంభమైన ఆయన జర్నీ మనల్ని ఇప్పటికీ అబ్బుర పరుస్తూనే ఉంటుంది.

Ramcharan Emotional Post On Chiru 45 Years Cini Journey , Chiranjeevi, Ramcharan
Advertisement
Ramcharan Emotional Post On Chiru 45 Years Cini Journey , Chiranjeevi, Ramcharan

వెండితెర పై అద్భుతమైన నటనతో బయట మీ మానవత్వంతో కూడిన కార్యకలాపాలను కొనసాగిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.ఎంతో క్రమశిక్షణ కష్టపడే తత్వం అంకిత భావం వంటి విలువలతో పాటు వాటన్నింటికీ మించిన కరుణను పెంపొందించిన నాన్నకు ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా రామ్ చరణ్ తన తండ్రి సినీ కెరియర్ గురించి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక రాంచరణ్ తో పాటు పలువురు మెగా హీరోలు కూడా చిరంజీవి గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తూ చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేశారు.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు