స్టూడియో నిర్మాణం కోసం రామానాయుడు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా?

మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ రోజులవి.అక్కడి నుంచి ఎలాగైనా హైదరాబాద్ కు సినిమా పరిశ్రమను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

పలువురు ఇక్కడ స్టూడియోలు కట్టుకునేందుకు ప్లాన్లు వేశారు.అప్పటికే అక్కినేని నాగేశ్వర్ రావుకు అప్పటి జలగం వెంగళరావు సర్కారు బంజారాహిల్స్ లో స్థలం కేటాయించింది.

అదే సమయంలో సురేష్ మూవీస్ అధినేత రామానాయుడును కూడా స్థలం కావాలా అని అడిగాడు అప్పటి ముఖ్యమంత్రి.అయితే తనకు హైదరాబాద్ వచ్చే ఆలోచన లేకపోవడంతో వద్దని చెప్పాడు.

విజ‌యా ప్రొడ‌క్ష‌న్స్ అధినేతల్లో ఒక‌రైన నాగిరెడ్డి పిల్ల‌ల‌తో రామానాయుడు క‌లిసి ఉండేవాడు.అందుకే వాహినీ స్టూడియోనే త‌న స్టూడియోగా భావించాడు.

Advertisement
Ramanaidu Struggles To Build Stuido, Ramanayudu, Ramanayudu Studio, Venkatesh, S

అందులోనే సినిమాలు చేస్తూ వచ్చాడు.అదే సమయంలో అన్నపూర్ణ స్టూడియోలో రామానాయుడు సెక్రెటరీ అనే సినిమా చిత్రీకరణ జరిగింది.

అప్పుడు అన్నపూర్ణలో మద్రాసు వాహినీ నుంచి కార్పెంటర్లను, ఆర్ట్ డైరెక్టర్లను తీసుకొచ్చి సెట్ వేయించాడు.ఆ సినిమా ప్రారంభానికి వచ్చిన నాగిరెడ్డి ఈ కొండల్లో స్టూడియో కడితే బాగుంటుందని చెప్పారు.

అప్పుడు రామానాయుడు మదిలో స్టూడియో గురించి ఆలోచన వచ్చింది. వెంక‌ట్రామ్ సీఎంగా ఉన్న సమయంలో రామానాయుడుతో కృష్ణ‌కు ఫిల్మ్‌ న‌గ‌ర్‌లో స్థ‌లాలు కేటాయించారు.

Ramanaidu Struggles To Build Stuido, Ramanayudu, Ramanayudu Studio, Venkatesh, S

ఓసారి ఎన్టీఆర్ రామానాయుడుకు ఇచ్చిన స్థ‌లం చూడ్డానికి వచ్చాడు.ఈ రాళ్లల్లో ఏం స్టూడియో కడతావు అన్నాడు.వ్యూ చాలా బాగుంటుందని చెప్పాడు రామానాయుడు.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

వ్యాపారం చేయడానికి స్టూడియో కడుతున్నావా.? వ్యూ చూస్తూ కూర్చోడానికి కడుతున్నావా? అన్నాడు.అనంతరం ఆ ప్రాంతంలోని రాళ్లను పగలకొట్టించాలి అనుకున్నాడు రామానాయుడు.

Advertisement

అయితే ఒక్క రాయిని పగలగొట్టడానికి 6 నెలల సమయం పట్టింది.దీంతో ఆయన చాలా నిరాశకు లోనయ్యాడు.

పెద్ద కొడుకు సురేష్ బాబు ఆయనతో ఉండటం, చిన్నకొడుకు వెంకటేష్ హీరో కావడంతో ఆయనకు స్టూడియో కట్టాలనే ఆశ పెరిగింది.డబ్బంతా ఖర్చు పెట్టి రాళ్లను చదును చేయించాడు.

చక్కటి స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.స్క్రిప్ట్ తో వచ్చి సినిమా రీల్ పట్టుకెళ్లేలా స్టూడియోను నిర్మించాడు రామానాయుడు.

తాజా వార్తలు