టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు( Ram Gopal Varma ) ప్రత్యేక గుర్తింపు ఉంది.ఈ మధ్య కాలంలో పొలిటికల్ సినిమాలను వర్మ ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు.
తాజాగా వర్మ సంచలన ప్రకటన చేయగా ఆ ప్రకటన నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.రాజకీయాలు, రాజకీయ నేపథ్య సినిమాలకు( Political Movies ) దూరంగా ఉంటానని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.
కొత్త ప్రతిభను ప్రోత్సహించాలని అనుకుంటున్నానని ఆయన అన్నారు.
ప్రేక్షకులకు నచ్చే సినిమా చేయాలని భావిస్తున్నానని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.
సినిమా మేకింగ్ లో ప్రేక్షకులను సైతం ఇన్వాల్వ్ చేయాలని ఫీలవుతున్నానని ఆయన కామెంట్లు చేశారు.వ్యూహం,( Vyooham ) శపథం( Sapatham ) సినిమాలు డిజాస్టర్లుగా నిలిచిన నేపథ్యంలో వర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రామ్ గోపాల్ వర్మ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాజెక్ట్ లతో ముందుకు వస్తారో చూడాల్సి ఉంది.వర్మ పారితోషికం సైతం పరిమితంగా ఉందనే సంగతి తెలిసిందే.ఆర్జీవీకి స్టార్ హీరోలు ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే లేదని తెలుస్తోంది.వర్మతో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదని సమాచారం అందుతోంది.వర్మకు పూర్వ వైభవం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రామ్ గోపాల్ వర్మ సరైన ప్రాజెక్ట్ లతో ఎంట్రీ ఇస్తే బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.ఆర్జీవీని అభిమానించే ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఉన్నారో ఆయనను విమర్శించే ఫ్యాన్స్ సైతం అదే స్థాయిలో ఉన్నారు.ఆర్జీవీ సినిమాల్లో నటిస్తే తమ కెరీర్ పుంజుకుంటుందని ఇప్పటికీ సరైన గుర్తింపు ఇండస్ట్రీ ప్రముఖులు ఫీలవుతున్నారు.
వర్మ శిష్యులు ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు చేస్తుండగా వర్మ మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచే సినిమాలను తీస్తూ షాకిస్తున్నారు.







