ఒక హిట్టు మూడు ఫ్లాపులు అన్నట్టుగా రవితేజ కెరియర్... కేవలం డబ్బుల కోసమే సినిమానా ..?

రవితేజ( Ravi Teja ) గత కొన్నేళ్లుగా తీస్తున్న సినిమాల విషయాలు మనం గమనిస్తే ఒక హిట్టు పడితే మరొక పెట్టు పట్టడానికి మూడు నాలుగు ఫ్లాపులు చవిచూడాల్సి వస్తుంది.కేవలం రెమ్యునరేషన్ కోసమే సినిమాలు తీస్తున్నాడా ఏంటి అనే అనుమానం కూడా కొంతమందికి కలుగుతుంది.

 Mass Raja Ravi Teja Upcoming Movies Details, Ravi Teja , Ravi Teja Movies, Mass-TeluguStop.com

ఎందుకంటే డబ్బు గట్టిగా ఇస్తే చాలు కథ కూడా వినకుండా రవితేజ ఓకే చెబుతున్నట్టుగా అతడు తీస్తున్న సినిమాలు కనిపిస్తున్నాయి.దాంతో ఫాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

అయితే వీటన్నిటికీ గట్టి సమాధానం ఇవ్వాలని ప్రస్తుతం రవితేజ ఫిక్స్ అయ్యాడట.అందుకే క్రేజీ కాంబినేషన్స్ పై కన్నేశాడు.

ప్రస్తుతం రవితేజ తీస్తున్న ఆ సినిమాలు ఏంటి? మాస్ రాజా( Mass Raja ) ఇమేజ్ ఎలా కాపాడుకోబోతున్నాడు అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Dhamaka, Eagle, Krack, Massraja, Bachchan, Raavanasura, Ravi Teja, Ravi T

రవితేజ వరుస విజయాలు అందుకోవడం దాదాపు అసాధ్యం అని అనిపిస్తుంది.కెరియర్ మొదట్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ మధ్యలో కృష్ణ, దుబాయ్ శీను 2010లో డాన్ శీను 2011లో మిరపకాయ్ వంటి వరుసగా రెండు విజయాలు అందుకున్న రవితేజ ఆ తర్వాత ఒక విజయనందుకు ఉంటే రెండు మూడు ఫ్లాప్స్ దక్కించుకుంటున్నాడు.ఇది గత పదేళ్ల క్రితం మాట ఇక ఇప్పుడైతే ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.2018లో క్రాక్ సినిమాతో( Krack ) విజయాన్ని దక్కించుకున్న రవితేజ ఆ తర్వాత కిలాడి, రామారావు అండ్ డ్యూటీ సినిమాతో మళ్లీ పరాజయాలనే చవిచూడాల్సి వచ్చింది దీనితో ఫాన్స్ మరింత డిసప్పాయింట్ అయ్యారు.

Telugu Dhamaka, Eagle, Krack, Massraja, Bachchan, Raavanasura, Ravi Teja, Ravi T

దాదాపు అందరూ ఇక రవితేజ పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో దమాకతో( Dhamaka ) ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా 100 కోట్ల క్లబ్ లో చేరారు.ఈ సినిమా కథ చాలా రొటీన్ గా ఉన్న మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ కావడంతో కలెక్షన్స్ దుమ్ము దులిపింది.మరోవైపు వాల్తేరు వీరయ్య విజయంలోనూ రవితేజ పాత్ర మేజర్ రోల్ ఉంటుంది.

ఇక ఆ తర్వాత వచ్చిన రావణాసుర,( Raavanasura ) ఈగల్,( Eagle ) టైగర్ నాగేశ్వరరావు వంటి వరుస పరాజయాలు వచ్చాయి.దాంతో తనకు అచ్చొచ్చిన క్రేజీ కాంబినేషన్స్ వైపు రవితేజ చూపు పడింది గతంలో గోపి చంద్ మలినేని తో మంచి విజయాలు అందుకున్న రవితేజ ఇప్పుడు ఆయనతో మరో సినిమాలో నటించడున్నాడు.

అలాగే హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) చిత్రంలో కూడా నటిస్తున్నాడు.ఇది మాత్రమే కాకుండా జాతి రత్నాలు సేమ్ అనుదీప్ తో కూడా ఒక సినిమా కమిట్ అయ్యాడు.

ఇవన్నీ వర్కౌట్ అయితే మళ్లీ మనోడి మాస్ మార్కెట్ మరో రేంజ్ కి పెరిగిపోవడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube