నేను ఇచ్చిన బహుమతిని నా భార్య మొహంపైనే తిప్పికొట్టింది.. చరణ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం సంతోషంగా ఉన్నారు.

పెళ్లైన 11 సంవత్సరాల తర్వాత చరణ్ దంపతులకు క్లీంకార( Klin Kaara ) పుట్టింది.

క్లీంకార రాకతో మెగా ఫ్యామిలీ ప్రస్తుతం సంతోషంగా ఉంది.తాజాగా రామ్ చరణ్ ఒక సందర్భంలో ఉపాసనకు( Upasana ) ఇచ్చిన బహుమతి గురించి కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

తాను ఇచ్చిన గిఫ్ట్ ను 5 సెకన్లకు ఉపాసన తిప్పికొట్టిందని రామ్ చరణ్ వెల్లడించడం గమనార్హం.రామ్ చరణ్ మాట్లాడుతూ అమ్మాయిలకు ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే నచ్చుతుందో అబ్బాయిలకు అస్సలు తెలియదని అన్నారు.

అమ్మాయిలకు గిఫ్ట్స్ ( Gifts ) ఇచ్చే విషయంలో నేను చాలా వీక్ అని రామ్ చరణ్ కామెంట్లు చేశారు.పెళ్లైన కొత్తలో నా భార్యకు బహుమతి ఇస్తే ఆ బహుమతిని నా మొహానే తిప్పికొట్టిందని చరణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

ఉపాసన కోసం నేను చాలా ఖరీదైన బహుమతిని కొన్నానని రామ్ చరణ్ పేర్కొన్నారు.

మొదట ఆ బహుమతిని చూసిన వెంటనే నా భార్య ఫ్లాట్ అవుతుందని నేను భావించానని రామ్ చరణ్ పేర్కొన్నారు.చూసిన 5 సెకన్లలోనే నా భార్య నేను తెచ్చిన బహుమతిని తిరస్కరించిందని రామ్ చరణ్ వెల్లడించారు.ఉపాసన కోసం గిఫ్ట్ సెలెక్ట్ చేయడానికి నాకు మాత్రం ఏకంగా 5 గంటల సమయం పట్టిందని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

దూరంగా ఉండే షాప్ కు వెళ్లి మరీ గిఫ్ట్ కొన్నానని చరణ్ కామెంట్లు చేశారు.

అమ్మాయిలకు ముందుగా గిఫ్ట్ చూపించి కొనివ్వడం ఉత్తమమని అంతే తప్ప అమ్మాయిలను సర్ప్రైజ్ చేయాలని భావించడం మాత్రం కరెక్ట్ కాదని రామ్ చరణ్ వెల్లడించారు.నాకు వాచీలు సేకరించడం ఇష్టమని నా దగ్గర 15 ఖరీదైన వాచీలు ఉన్నాయని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.కరోనా సమయంలో క్యాసినో వాచ్ ను( Casio Watch ) ఆన్ లైన్ లో కొనుగోలు చేశానని అయన కామెంట్లు చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు