ఔను నిజంగానే మేము చెప్పినట్లుగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' అనౌన్స్‌మెంట్‌ రాబోతుంది

తెలుగు స్టాప్ వీక్షకులకు ఇటీవలే ఆర్ఆర్‌ఆర్ టీం నుండి రిపబ్లిక్ డే సర్‌ ప్రైజ్ రాబోతుంది అంటూ అందరి కంటే ముందు తెలియజేసిన విషయం తెల్సిందే.

రిపబ్లిక్‌ డే సందర్బంగా ఒక కీలకమైన అనౌన్స్ మెంట్‌ ను ఆర్ఆర్ఆర్‌ టీం ఇవ్వబోతున్నట్లుగా మేము చెప్పాము.

అది విడుదలకు సంబంధించిన విషయం అని కూడా మేము మీ అందరికి తెలియజేయడం జరిగింది.నేడు యూనిట్ సభ్యులు అధికారికంగా అదే విషయాన్ని తెలియజేశారు.

రిపబ్లిక్ డే సందర్బంగా నేడు మద్యాహ్నం సమయంలో 2 గంటలకు ఒక కీలకమైన అనౌన్స్‌ మెంట్‌ చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు.దాంతో అంతా కూడా సినిమా విడుదల తేదీ గురించి ఆ ప్రకటన అంటూ ఊహాగాణాలు చేస్తున్నారు.

ఈ విషయాన్ని మేము ఇంతకు ముందే మీకు తెలియజేయడం జరిగింది.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ మెజార్టీ పార్ట్‌ పూర్తి అయ్యింది.

Advertisement

షూటింగ్‌ త్వరలోనే పూర్తి అవుతుందనే నమ్మకంతో అంతా ఎదురు చూస్తున్నారు.కనుక సినిమాను అక్టోబర్‌ లో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

నేడు యూనిట్‌ సభ్యులు అధికారికంగా అదే విషయాన్ని అనౌన్స్ చేస్తారని అనిపిస్తుంది.అక్టోబర్‌ లో దసరా కానుకగా ఈ భారీ మల్టీ స్టారర్‌ మూవీ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మరో వైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.కనుక షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ కూడా త్వరగానే అయ్యే అవకాశం ఉంది.

కనుక భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను వచ్చే దసరాకు విడుదల చేయడంలో ఎలాంటి అనుమానాలు అయితే ఉండవు అంటున్నారు.ఎన్టీఆర్‌ రామ్ చరణ్‌ లు నటిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

వీధి ఆవులకు రొట్టెలు పెడుతున్న మహిళ.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు