రామ్ చరణ్ మనసు దోచిన పిల్ల.. ఎవరంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇటీవల చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది.

అయితే నేటితరం హీరోయిన్లలో చరణ్‌కు ఎవరంటే ఇష్టం అనే ప్రశ్నకు సమాధానం ఏమిటో చాలా మందికి తెలియదు.కానీ ఇటీవల చరణ్ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఎలాంటి సందేహం లేకుండా ఠక్కున సాయి పల్లవి పేరును చెప్పేశాడు.ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో తనకు సాయి పల్లవి యాక్టింగ్, డ్యాన్స్ స్టెప్పులు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.

Advertisement

అయితే నిజంగానే చరణ్‌కు సాయి పల్లవి ఇష్టమా లేక తనతో నటించిన హీరోయిన్లలో ఎవరి పేరైనా చెబితే లేనిపోని సమస్య వస్తుందని ఇలా చెప్పాడా అనేది ఆసక్తిగా మారింది.మొత్తానికి సాయి పల్లవి పేరు చెప్పడంతో ఈ వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఆ జిల్లాలో తొలి స్థానంలో నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం.. అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయిగా!
Advertisement

తాజా వార్తలు