రామ్ చరణ్ కి తోడల్లుడు కాబోతున్న శర్వానంద్

చిన్న చిన్న పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత మెల్లగా మెయిన్ లీడ్స్ కి ఎదిగి ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని, ఫ్యాన్స్ బేస్ ని క్రియేట్ చేసుకున్న టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్.

కెరియర్ లో మొదటి నుంచి విభిన్న కథలతో సినిమాలు చేస్తూ నటుడుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న శర్వానంద్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.

ఈ మూడు సినిమాల మీద మంచి పాజిటివ్ టాక్ ఉంది.ఇక ఈ మూడు సినిమాలు డిఫరెంట్ జోనర్ కథాంశాలతో తెరకెక్కుతున్నవే కావడం విశేషం.

ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.గత ఏడాది రానా, నిఖిల్, నితిన్ పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నారు.

ఇప్పుడు వీరి దారిలోకి శర్వానంద్ కూడా చేరబోతున్నాడు.త్వరలో అతను కూడా పెళ్లి కొడుకు కాబోతున్నాడని తెలుస్తుంది.

Ram Charan Behind Sharwanand Marriage Proposal, Tollywood, Telugu Cinema, South
Advertisement
Ram Charan Behind Sharwanand Marriage Proposal, Tollywood, Telugu Cinema, South

రామ్ చరణ్, శర్వానంద్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికి తెలిసిందే.ఇద్దరు ఒకే స్కూల్ లో చదువుకున్నారు.ఈ నేపధ్యంలో శర్వానంద్ కి మొదటి నుంచి రామ్ చరణ్ సపోర్ట్ ఉంది.

అయితే ఇప్పుడు ఈ బెస్ట్ ఫ్రెండ్స్ తొడల్లుళ్లు కాబోతున్నారనే వార్త గట్టిగా వినిపిస్తుంది.శర్వానంద్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు శర్వానంద్ చేసుకోబోయేది ఉపాసన కొణిదెల కజిన్ సిస్టర్ కామినేని అనుష్క అని వినిపిస్తోంది.ఈ పెళ్లికి ఇరు కుటుంబాలను ఉపాసన దగ్గరుండి ఒప్పించినట్టు తెలుస్తోంది.అంతే కాకుండా ఈ పెళ్లికి రామ్ చరణ్ పెద్దగా వ్యవహరిస్తారని కూడా టాక్ వినిపిస్తుంది.

ఉపాసన, రామ్ చరణ్ తరహాలోనే వారిద్దరూ కూడా ప్రేమించుకున్నట్లు తెలుస్తుంది.ఇక త్వరలోనే ఈ పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుందట.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు