టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్యనే తన ప్రేమికుడు జాకీ భగ్నానిని పరిచయం చేసింది.సౌత్ సినిమాలతో పాటుగా బాలీవుడ్ సినిమాలతో కూడా బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఛత్రీవాలీ సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమాలో ఆమె కండోం టెస్టర్ గా డిఫరెంట్ రోల్ లో నటిస్తుంది.రీసెంట్ గా ఈ సినిమాకు సంబందించిన భారీ షెడ్యూల్ లక్నోలో జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు రకుల్.ఈ క్రమంలో ఆమె పెళ్లిపై మీడియా ప్రశ్నించగా అందుకు టైం రావాలని అంటుంది.
అలాంటిది ఏదైనా ఉంటే తప్పకుండా తెలియచేస్తానని అన్నది రకుల్.

తెలుగులో అమ్మడు కెరియర్ అటు ఇటుగా ఉన్నా సరే వచ్చిన ప్రతి చిన్న ఛాన్స్ చేస్తూ వస్తుంది రకుల్.రీసెంట్ గా కొండపొలం సినిమాలో నటించింది రకుల్.వైష్ణవ్ తేజ్ లాంటి యువ హీరో పక్కన నటించి మెప్పించింది రకుల్.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మొన్నటివరకు వరుస ఛాన్సులు అందుకున్న అమ్మడు ఈమధ్య కాస్త జోరు తగ్గించిందని చెప్పొచ్చు.చేస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవడంతో అమ్మడుని పక్కన పెట్టేస్తున్నారు.