మందు కొన్న రకుల్.. తాగేది కాదట!

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల సినిమాలు చాలా వరకు తగ్గించిందని చెప్పాలి.

కేవలం సెలెక్టివ్ చిత్రాలతో నెట్టుకొస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ వీడియోలో కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా సెలబ్రిటీలు ఇంటికే పరిమితం కాగా రకుల్ మాత్రం ఓ షాపు నుండి కొన్ని మందులు తీసుకుని వెళుతున్న సీన్ కనిపించింది.తాజాగా దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో రకుల్ కూడా మద్యం కొనుగోలు చేసిందని, దానికి సంబంధించిందే ఈ వీడియో అంటూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

అయితే నిజానికి ఈ వీడియోలో రకుల్ కొనుగోలు చేసింది మద్యం కాదు, మెడికల్ షాపులో నుండి మందులు తీసుకుని వెళ్లిందట.కానీ ఆమెను వీడియో తీసి ఇలా తప్పుగా చూపించారని ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఇలాంటి సమయంలో రకుల్‌ను ఇలా ప్రెజెంట్ చేసి ఏం సాధిస్తారని వారు మండిపడుతున్నారు.ఏదేమైనా రకుల్ ఈ వీడియోతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

కాగా రకుల్ మాత్రం ఈ వీడియోపై స్పందించలేదు.దీంతో ఆమె స్పందన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

అటు రకుల్ ప్రస్తుతం పలు హిందీ చిత్రాల్లో నటిస్తూనే, రెండు తమిళ చిత్రాలను లైన్‌లో పెట్టింది.తెలుగులో చాలా మంది స్టార్స్‌తో నటించిన రకుల్, ప్రస్తుతం ఒక్క సినిమా కూడా చేయడం లేదు.

దీంతో టాలీవుడ్‌లో మళ్లీ ఈ బ్యూటీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి రకుల్‌కు టాలీవుడ్‌లో బ్రేక్ ఇచ్చేది ఎవరో చూడాలి.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి
Advertisement

తాజా వార్తలు