మేకోవర్ వేస్ట్ అవుతోందంటున్న బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు.

ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

ఇప్పటికే పుష్ప అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించిన బన్నీ, ఈ సినిమా కోసం భారీ స్థాయిలో మేకోవర్ చేస్తున్నాడు.ఈ సినిమా కోసం గుబురు గడ్డంతో పాటు జుట్టును కూడా పెంచుతున్నాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడటంతో బన్నీ చేసిన మేకోవర్ వృథాగా పోతోందట.ఇప్పటికే నెలకుపైగా ఇంటికే పరిమితం అయిన బన్నీ, తన గడ్డం జుట్టు మరింత పెరిగిందని అంటున్నాడు.

పుష్ప సినిమా కోసం ఆయన చేసిన మేకోవర్ ఇలా లాక్‌డౌన్ వల్ల వృథా అవుతుండటం బాధగా ఉందని అంటున్నాడు.లాక్‌డౌన్ పూర్తయిన తరువాత కూడా సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

Advertisement

దీంతో బన్నీ ఆలోచనలో పడ్డాడట.సుకుమార్‌తో ముచ్చటగా మూడోసారి జతకడుతున్న బన్నీ పుష్ప సినిమాతో అదిరిపోయే హ్యాట్రిక్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తున్నాడు.కాగా ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా నటిస్తుండగా, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు