రాజోలు వైసీపీ లో జనసేన ఎమ్మెల్యే చిచ్చు ? వరుసగా రాజీనామాలు ?

జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ రావు ప్రత్యేక గుర్తింపు పొందారు.రాజోలు నియోజకవర్గం ఒకటే జనసేన పరువు ప్రతిష్టలను కాపాడింది.

 Rajolu Ycp Leaders Resigning On Disappointed With Mla Rapaka Vara Prasad Details, Rapaka Varaprasadrao, Janasena, Janasena Mla, Razole Mla, Jagan, Ap Cm, Pavan Kalyan, Sagi Ramaraju, Pavan Kalyan,-TeluguStop.com

అయితే ఆ ఆనందం ఎంతో కాలం లేకుండా అక్కడ గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చేశారు.తనకు జనసేన పార్టీలో అవమానాలు ఎదురవుతున్నాయని చెబుతూ, పార్టీకి రాజీనామాలు చేయకుండానే వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు.

గతంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కారు.సందర్భం వచ్చినప్పుడల్లా జగన్ ను పొగుడుతూ వస్తున్నారు.

 Rajolu Ycp Leaders Resigning On Disappointed With Mla Rapaka Vara Prasad Details, Rapaka Varaprasadrao, Janasena, Janasena Mla, Razole Mla, Jagan, Ap Cm, Pavan Kalyan, Sagi Ramaraju, Pavan Kalyan, -రాజోలు వైసీపీ లో జనసేన ఎమ్మెల్యే చిచ్చు వరుసగా రాజీనామాలు -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఆయనకు జగన్ సైతం అంతే స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నారు.ఇటీవలే ఆయనకు వైసీపీ ఇన్చార్జి పదవి ఇచ్చారు.

దీంతో ఆయన తన వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉండడంతో, మొదటి నుంచి వైసీపీలో ఉన్న నాయకులు తీవ్ర అసంతృప్తికి గురవుతూ పార్టీకి రాజీనామాలు చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రెండు రోజుల క్రితం వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి సాగి రామరాజు తో పాటు, నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జి బుల్లబ్బాయి తదితరులు రాజీనామా చేశారు.

తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకట రామరాజు పార్టీకి.పదవికి రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు.ఈ ప్రకటనతో ఆయన అనుచరగణం పార్టీకి దూరమయ్యారు.వీరే కాకుండా ఇంకా ఎంతోమంది వైసిపి నియోజకవర్గ స్థాయి నాయకులు రాజీనామా చేసేందుకు సిద్ధం అవుతూ ఉండడంతో వైసీపీ అధిష్టానం సైతం ఆందోళన చెందుతోంది.

ఇదంతా రాపాక వరప్రసాద్ కారణంగానే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.రాపాక వైసీపీ కి అనుబంధంగా కొనసాగుతున్నప్పటినుంచి నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్నారు.తన వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ మొదటి నుంచి వైసీపీలో ఉన్న వారిని పట్టించుకోకపోవడం తదితర కారణాలతో మిగతా వారంతా తీవ్ర అసంతృప్తికి గురవు తున్నట్టుగా వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ వ్యవహారంపై దృష్టి సారించకపోతే ఈ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందని వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube