రజినీకాంత్ పీకేసాడు !

కబలి సినిమాకి సంబంధించి రజినీకాంత్ స్టైలిష్ లుక్ ఇప్పటికే అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ని నింపేసింది.ఆయన డాన్ గా విడుదల అయిన గెటప్ లొ అదరహో అనిపించాయి.

తెల్లటి జుట్టుతో - గడ్డంలో ఎంతో స్టైలింగ్ తో కనిపించాడు సూపర్ స్టార్.ఆ మధ్య అవన్నీ చూసి సినిమా అంతా గడ్డంతో కనిపిస్తారు అనీ వార్తలు వచ్చాయి.

మళ్ళీ కట్ చేస్తే ఈ మధ్య కాలంలో రజినీకాంత్ పూర్తిగా గడ్డం తీసేసి కనిపించారు.ఆ గెటప్ రోబో-2 కోసం ఏమో అనుకోకండి.రోబో-2 ఫస్ట్ షెడ్యూల్ అవగానే.దాని నుంచి బ్రేక్ తీసుకుని మళ్లీ ‘కబాలి’ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ కోసం మలేషియాకు షిఫ్ట్ అయిపోయాడు రజినీ.

అక్కడ మలేషియాలో ‘కబాలి’ కోసం పని చేస్తున్న లోకల్ విలన్ తో కలిసి ఓ సెల్ఫీ దిగాడు రజినీ.ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Advertisement

ఈ కొత్త గెటప్ లోనూ చాలా స్టైలిష్ గానే ఉన్నాడు రజినీ.‘కబాలి’ షూటింగ్ 70 శాతం దాకా పూర్తయింది.

ప్రస్తుత ఫైనల్ షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తవుతుంది.ఆ తర్వాత తన ఫోకస్ అంతా రోబో-2 మీద పెడతాడు రజినీకాంత్.

Advertisement

తాజా వార్తలు