తెలంగాణలో బీజేపీ టిఆర్ఎస్ కలిస్తే పరిస్థితి ఏంటి అనే సందేహం మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు వచ్చింది.ఇదే విషయాన్ని ఢిల్లీకి వెళ్లిన రాజేందర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో సమావేశం అయిన సందర్భంగా ఈ సందేహాన్ని లేవనెత్తారు.” రాష్ట్రంలో టిఆర్ఎస్ బీజేపీ ఒకటేనన్న భావం ప్రజల్లో ఉంది.దానికి తగినట్లే టిఆర్ఎస్ నాయకత్వం వ్యవహరిస్తోంది.
మొదట కేంద్ర ప్రభుత్వ పథకాలను కేసీఆర్ తిడతారు.తర్వాత అమలు చేస్తారు.
ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల అమలే దీనికి ఉదాహరణ.భవిష్యత్తులో టీఆర్ఎస్ బీజేపీలు చేతులు కలిపితే బీజేపీ చేరిన మాలాంటి వారి పరిస్థితి ఏమిటి ? రాష్ట్ర ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నా, కేంద్ర ప్రభుత్వం విచారణ చేయకపోవడంపై ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయి ” అంటూ ఈటెల రాజేందర్ నడ్డా వద్ద ప్రస్తావించారు.

దీనిపై స్పందించిన నడ్డా ” పశ్చిమ బెంగాల్లో మూడు స్థానాల నుంచి అధికారం చేపడతామనే వరకు ఎదిగాం.తెలంగాణలోనూ అంతకుమించి దూకుడు ప్రదర్శిస్తాం.టిఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై తగిన సమయంలో స్పందిస్తాం.కెసిఆర్ కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎందుకు విమర్శిస్తున్నారో.తరువాత ఎందుకు అమలు చేస్తున్నారో అక్కడి ప్రతిపక్షాలే ప్రశ్నించాలి.రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.” అంటూ రాజేందర్ సందేహాలకు సమాధానం ఇచ్చారట.ఈ సందర్భంగా రాజేందర్ స్పందిస్తూ, బిజేపి లో చేరితే తనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారట.
దీనిపై స్పందించిన నడ్డా పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యత ఇస్తామని, వెంటనే పార్టీలో చేరే విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారట.ఈటెల వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
జేపీ నడ్డా తో భేేటీ అనంతరం తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ తోనూ భేటీ అయ్యారు.

ఇక ఈ రోజు మరికొంత మంది కేంద్ర బీజేపీ పెద్దలను కలిసి తన రాజకీయ భవిష్యత్తుపై రాజేందర్చర్చించ బోతున్నారు.ఈటెల ను బీజేపీలో చేర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్న పార్టీ పెద్దలు ఆయన కు రాజ్యసభ సభ్యత్వం తో పాటు , కేంద్ర మంత్రి పదవి ఇచ్చేే అవకాశాలు కనిపిస్తున్నాయి .ఇది ఇలా ఉంటేే రాజేందర్ చేరికపై బీజేపీ లోని ఒక వర్గం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.