తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.పాలన పక్కన పెట్టి తన బినామీలు మరియు వారి సంస్థలకు వేల కోట్లు విలువైన భూములు మరియు కాంట్రాక్ట్ లు కట్టబెట్టే పనిలో నిమగ్నమయ్యారని ఆరోపించారు.
నెల్లూరు జిల్లా గూడూరులో 4827 ఎకరాలను ఓ కంపెనీకి కట్టబెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే కేసు విచారణలో ఉండగానే గెజిట్ నోటిఫికేషన్ భూముల స్వాధీనానికి వైయస్ జగన్ ఆరాటపడుతున్నారని మండిపడ్డారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రమే కాదు విపక్ష నాయకులు సైతం వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

పాలన పక్కన పెట్టేసి సొంత లాభం కోసం ఇష్టానుసారంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో అధికారం ఉన్న సమయంలోనే.లాభపడాలి అన్న దిశగా వ్యవహరిస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ దిశగానే ఇప్పుడు టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది.







