సహజీవనం విషయంలో రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు

ఎవరో ఒక అమ్మాయి తో సహజీవం చేసి ఆ తరువాత వేరొకరిని వివాహం చేసేసుకోవచ్చ్చు అని అనుకుంటే తప్పులో కాలేసి నట్లే.

ఇలాంటి వాళ్లకి షాక్ ఇస్తూ రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

ఒక మహిళ తో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసి ఆతరువాత మరో యువతిని పెళ్లాడేందుకు ప్రయత్నించినా రాజస్థాన్ కు చెందిన వ్యక్తి కి అక్కడి హైకోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది.భారతీయ సమాజంలో సహజీవం చేయడం అంటే పెళ్లి చేసుకున్నట్లే పరిగణించాలి తప్ప మరోలా భావించకూడదు అని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

వివరాల్లోకి వెళితే.ఒక పాఠశాల లో టీచర్ గా పనిచేస్తున్న వివాహితతో అదే పాఠశాలలో ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న బలరాం అనే వ్యక్తి తో స్నేహం కుదిరింది.

అనంతరం ఆ స్నేహం ప్రేమగా మారడం తో ఇద్దరూ సహజీవనానికి సిద్ధమయ్యారు.దీనితో ఆమె తన భర్త నుంచి వేరుపడి మరీ అతడితో సహజీవం చేస్తుంది.

Advertisement

ఈ క్రమంలో పెళ్లి కూడా చేసుకుంటాను అని చెప్పడం తో సదరు మహిళ అతడితో కలిసి సహజీవం చేయడానికి అంగీకరించింది.అయితే ఇటీవల బలరాం కు ఐటీ సెక్టార్ లో ఉద్యోగం లభించడం తో అతడు మరో అమ్మాయిని పెళ్లాడేందుకు సిద్దమయ్యాడు.

దీనితో సదరు మహిళ రాజస్థాన్ హైకోర్టు ను ఆశ్రయించడం తో కోర్టు పై సంచలన తీర్పును వెల్లడించింది.ఇటీవల దాదాపు చాలా మంది కూడా సహజీవం పేరు తో యువతి యువకులు ఒకే ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు