త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు( Mahesh Babu Birthday ) రాబోతుంది.ఎప్పటిలాగానే ఈసారి కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈయన నుండి భారీ ట్రీట్ కోరుకుంటున్నారు.
మరి ఈ విషయంలో ఈసారి దర్శక నిర్మాతలు కూడా మహేష్ ఫ్యాన్స్ కోసం ఆయన పుట్టిన రోజు నాడు ఎప్పటి కంటే మరింత ఎక్కువుగా సర్ప్రైజ్ లు రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఆగస్టు 9న మహేష్ బర్త్ డే ఉన్న నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్ కు ఈసారి ట్రిపుల్ ట్రీట్ సిద్ధం అవుతుంది అని టాక్.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ట్రీట్స్ అనగానే ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.మరి అందులో రాజమౌళి ట్రీట్ కూడా ఉండబోతుంది అని టాక్ వినిపిస్తుంది.”రౌద్రం రణం రుధిరం” వంటి భారీ మల్టీ స్టారర్ తర్వాత ఇప్పుడు రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్నాడు అనే విషయం తెలిసిందే.
ప్రెజెంట్ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేస్తున్నారు.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంత వరకు రానటువంటి కథాంశంతో రాజమౌళి ఈ సినిమా చేయబోతున్నాడు అని ఇప్పటికే టాక్.రాజమౌళి అండ్ టీమ్( Rajamouli ) ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ తో బిజీగా ఉన్నారు.
మరి జక్కన్న ఎప్పుడు తన నటీనటుల పుట్టిన రోజులకు బిగ్ ట్రీట్ ఇస్తుంటారు.ఈ క్రమంలోనే ఈసారి మహేష్ కోసం కూడా రాజమౌళి ట్రీట్ రెడీ చేస్తున్నారట.

అందుతున్న సమాచారం ప్రకారం జక్కన్న ఆగస్టు 9న తమ ప్రాజెక్ట్ గ్రాండ్ అనౌన్స్ మెంట్ చేయడమే కాకుండా సూపర్ స్టార్ ను మునుపెన్నడూ చూడని వినూత్నమైన కాన్సెప్ట్ పోస్టర్ ను బర్త్ డే రోజు రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారట.మరి ఈ అప్డేట్ విన్న వారంతా మహేష్ ను ఎంత కొత్తగా ప్రజెంట్ చేస్తారా అని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.ఇది పాన్ ఇండియన్ ప్రాజెక్ట్( Pan India Movie ) కావడంతో హాలీవుడ్ అత్యుత్తమ ప్రతిభావంతులతో పాటు ఇండియన్ పరిశ్రమ నుండి ఎలాంటి నటీనటులను ఎంపిక చేస్తారో చూడాలి.







