బ్రో ఈవెంట్ లో మెగాస్టార్ పెట్టుకున్న వాచ్ ధర ఎంతో తెలుసా... అందరి చూపు వాచ్ పైనే?

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి రేంజ్ కి అనుగుణంగా ఎన్నో వస్తువులను ఉపయోగిస్తుంటారు.వారు వేసుకుని షూ, డ్రస్సు నుంచి పెట్టుకునే వాచ్,తిరిగే కార్లు ఉండే బంగ్లాల వరకు కూడా ఎంతో ఖరీదైనవే ఉంటాయి అయితే ఇలా సెలబ్రిటీలు ఉపయోగించే వస్తువుల ధరలను కొన్నిసార్లు సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్స్ ఆశ్చర్యపోతూ ఉంటారు.

 Do You Know The Price Of The Watch Worn By The Megastar At The Bro Event, Chiran-TeluguStop.com

ఇలా ఎంతో ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి( Chiranjeevi ) చేతికి పెట్టుకున్నటువంటి వాచ్( Watch ) పై అందరి దృష్టిపడింది.

Telugu Baby, Bhola Shankar, Chiranjeevi, Watch-Movie

మెగాస్టార్ చిరంజీవి తాజాగా బేబీ సినిమా( Baby Movie ) వేడుకలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో విషయాల గురించి మాట్లాడినప్పటికీ అభిమానులు నేటిజన్స్ మాత్రం ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన వేసుకున్న డ్రెస్ చేతికి కట్టుకున్న వాచ్ పై అందరి చూపు పడింది.

బ్రౌన్ కలర్ టీషర్ట్ క్రీం కలర్ ప్యాంటుతో చాలా స్టైలిష్ లుక్ లో యంగ్ హీరోలు కూడా కుళ్లుకునేలా చిరంజీవి ఉన్నారు.

Telugu Baby, Bhola Shankar, Chiranjeevi, Watch-Movie

ఇక మెగాస్టార్ తన చేతికి కట్టుకున్నటువంటి వాచ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ క్రమంలోనే బేబీ ఈవెంట్లో చిరంజీవి కట్టుకున్నటువంటి వాచ్ ఏ బ్రాండ్ కు చెందిన అంటూ ఆరా తీయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.మెగాస్టార్ చిరంజీవి బేబీ ఈవెంట్లో కట్టుకున్నటువంటి వాచ్ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్ ను పెట్టుకున్నారు.

వాచ్ మార్కెట్ విలువ 230,000 డాలర్లు.మ‌న ఇండియ‌న్ క‌రెన్సీలో చెప్పాలంటే.అక్ష‌రాల‌ 1.89 కోట్లు.అంటే దాదాపుగా  2 కోట్లు విలువ చేసే వాచ్ ను చిరంజీవి పెట్టుకున్నారనీ తెలియడంతో నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.ఈయన సినిమాల విషయానికొస్తే ఆగస్టు 11వ తేది చిరంజీవి నటించిన భోళా శంకర్ ( Bhola Shankar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube