దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లుగా హీరోలు మరే ఇతర సినిమాను కూడా ఓకే చేయలేదు.
కాగా ఇటీవల తారక్ తన నెక్ట్స్ చిత్రాన్ని అనౌన్స్ చేసినా అది పట్టాలెక్కేందుకు ఇంకా సమయం పడుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక చరణ్ సంగతి కూడా అంతే ఉండటంతో ఈ ఇద్దరు హీరోలు తమ నెక్ట్స్ సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తారా, జక్కన్న వీరికి ఎప్పుడు పర్మిషన్ ఇస్తాడా అని అందరూ అనుకున్నారు.
కాగా తాజాగా రాజమౌళి ఈ ఇద్దరు హీరోలకు వేరే సినిమాలు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.దీంతో తారక్, చరణ్‌లు ఇద్దరు కూడా తమ నెక్ట్స్ ప్రాజెక్టులను రెడీ చేసే పనిలో పడ్డారని చిత్ర వర్గాల టాక్.
ఇక తమ హీరోలు వేరే సినిమాలు చేసేందుకు జక్కన్న పర్మిషన్ ఇవ్వడంతో వారి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ హీరోలు ఇప్పటికే ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన మెజారిటీ శాతం షూటింగ్‌ను ముగించుకున్న సంగతి తెలిసిందే.