ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ఖర్చుతో ఒక సినిమా తియ్యొచ్చు తెలుసా?

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమాను ఎస్ .

ఎస్ .రాజమౌళి దాదాపుగా నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమాను వెండితెరపై చూడడానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ లకు, పోస్టర్ లకు, పాటలకి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఇక చెర్రీ అభిమానులు, తారక్ అభిమానులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న  ,14 భాషల్లో పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్ గా థియేటర్లలో  విడుదల కానుంది.ఇక విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ఇప్పటికే ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

Advertisement

ఈ ప్రమోషన్స్ లో భాగంగా దర్శక నిర్మాతలు, హీరోలు క్షణం తీరిక లేకుండా తిరుగుతూ ప్రమోషన్స్  చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.కొన్ని ప్రదేశాలలో ప్రమోషన్స్ చేస్తూ అలసత్వం ప్రదర్శించకుండా సినిమాలను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు.

ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ మరొక సారి విజృంభిస్తుండడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీ తో మాత్రమే తెరచాలి అంటూ ఆంక్షలు విధించారు.

ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా మరొకసారి వాయిదా పడుతుంది అంటూ వార్తలు వినిపించినప్పటికీ దర్శకుడు రాజమౌళి అనుకున్న సమయానికి చెప్పిన సమయానికి ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించాడు.ఇదిలా ఉంటే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది.ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఏకంగా 40 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వేరే రాష్ట్రాలకు వెళ్లడానికి ప్రత్యేకంగా విమానం బుక్ చేసుకొని వెళ్తున్నట్లు సమాచారం.అదే విధంగా అక్కడ జరిగే ఈవెంట్స్ కోసం కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఈ చిత్ర బృందం ప్రమోషన్స్ కోసం ఖర్చు చేసే ఆ నలభై కోట్ల రూపాయలతో ఒక సినిమాను కూడా తీయవచ్చు.

Advertisement

తాజా వార్తలు