లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెళ్లిపోయారు.సభా వేదికగా మణిపూర్ అంశంపై మాట్లాడిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ప్రసంగం ముగిసిన వెంటనే బయటకు వెళ్లిన రాహుల్ గాంధీ ఇవాళ రాజస్థాన్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది.కాగా రాజస్థాన్ లో రాహుల్ గాంధీ పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రసంగం అనంతరం ఆయన వెళ్లిపోయారని సమాచారం.
మణిపూర్ అంశంపై చర్చించాలంటూ విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.