కాసేపట్లో రాహుల్ భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభం..!!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించనున్న భారత్ జోడో న్యాయ యాత్ర మరికాసేపటిలో ప్రారంభం కానుంది.

మణిపూర్ లో యాత్ర ప్రారంభంకానుండగా ఇంఫాల్ కు రాహుల్ చేరుకున్నారు.

ఈ క్రమంలో రాహుల్ గాంధీకి పార్టీ నేతలు ఇంఫాల్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు.భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర మణిపూర్ టూ ముంబై వరకు కొనసాగనుంది.ఐదు రాష్ట్రాల్లోని వంద లోక్ సభ నియోజకవర్గాల మీదుగా రాహుల్ గాంధీ యాత్ర నిర్వహించనున్నారు.67 రోజుల్లో 110 జిల్లాలను కవర్ చేయనున్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో మార్చి 21వ తేదీన ముంబైలో ఈ న్యాయ యాత్ర ముగియనుంది.

ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి

తాజా వార్తలు