Raghu Rama Krishnam Raju : అయోమయంలో రఘురామకృష్ణరాజు రాజకీయ భవిష్యత్!

నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ లీడర్ రఘరామకృష్ణరాజు భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది.

ఎంపీగా ఎన్నికైన నెల రోజుల వ్యవధిలోనే వైఎస్‌ఆర్‌సి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రఘరామకృష్ణరాజు తిరుగుబాటు జెండా ఎగరవేశారు .

అప్పటి నుండి రఘరామకృష్ణరాజు రాజకీయ భవిష్యత్తు ఏమిటనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రఘరామకృష్ణరాజు సరైన రాజకీయ వేదిక కోసం ప్రయత్నాలు మెుదలు పెట్టారు.

తెలుగుదేశం లేదా జనసేన చేరాలని ప్రయత్నస్తున్నట్లు తెలుస్తోంది.ఈ రెండు పార్టీల్లో చేరడం కుదరకపోతే రఘరామకృష్ణరాజుకు ఉన్న మరో ఆప్షన్ బీజేపీ.

భారతీయ జనతా పార్టీ నేతలతో రఘరామకృష్ణకు మంచి సబంధాలు ఉన్నాయి.ఏపీ సిఐడి పోలీసుల అరెస్టు చేసిన కేంద్రం నుండి రఘరామకృష్ణ కొంత సహాయం లభించింది.

Advertisement

బ్యాంకు ప్రాడ్ కేసుల్లో ED, IT దాడుల విషయంలోనూ బీజేపీ ఆయనకు ఎంతగానో సహకరించింది.రఘరామకృష్ణ ఎక్కువగా టీడీపీలో చేరడంపై మెుగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.

ఒక్కవేళ ఆయన టీడీలో చేరితే నరసాపురం నుండి కాకుండా మరో నియోజకవర్గం నుండి రఘరామకృష్ణ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక నరసాపురం నుండి 2019 సార్వత్రిక ఎన్నికల్లో రఘు రామకృష్ణరాజుపై 31,900 ఓట్ల తేడాతో ఓడిపోయిన వేటుకూరి వెంకట శివరామరాజును మరో టిడిపి రంగంలోకి దించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం మరోవైపు నరసాపురం నుంచి పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబును జనసేన పార్టీ నుండి బరిలోకి దింపాలని యోచిస్తున్నారు.టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే వీవీఎస్ రాజు లేదా నాగబాబు నరసాపురం నుండి పోటీ చేస్తారు కానీ రఘు రామకృష్ణరాజు ఇక్కడ నుండి పోటీ చేసే అవకాశం లేదు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు