రాజు గారి జోస్యం: పవన్ సీఎం అయితే జరిగేది ఇదే ?

పార్టీలో ఉంటారా అంటే కుదురుగా ఉండరు.పోనీ బీజేపీలో చేరుతారా అంటే చేరారు.

సొంత పార్టీలోనే అసమ్మతి రేపుతూ, కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్న నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు సంబంధించిన వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి.ఆయన పార్టీ పైన, జగన్ పైన విమర్శలు చేస్తూనే ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తూ హడావుడి చేస్తున్నారు.

అక్కడితో ఆగకుండా వైసీపీలో ఉన్న అసమ్మతి నాయకులను కలుస్తూ, వారితో ఫోటోలు దిగుతూ, వైసీపీ ని కవ్విస్తూ, ఆ పార్టీకి మరింత ఆగ్రహం కలిగిస్తూ హడావుడి చేస్తున్నారు.ఈయన పై ఇప్పటికే అనర్హత వేటు వేయించే దిశగా వైసిపి ఎంపీలు స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

బిజెపి అండదండలతోనే రఘురామకృష్ణరాజు ఈ తరహాగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వైసీపీలో ఉన్నాయి.తాజాగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

నరసాపురం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అప్పట్లో జనసేన ను తీవ్రస్థాయిలో విమర్శించిన రఘురామకృష్ణరాజు ఇప్పుడు మాత్రం పవన్ ను అదేపనిగా పొగిడేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఐదేళ్లలోనే ఆంధ్ర ప్రదేశ్ దేశంలోని వేగవంతమైన, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారిపోతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించడం సంచలనం రేపింది.

అసలు ఇంత అకస్మాత్తుగా పవన్ ముఖ్యమంత్రి అయితే అంటూ వ్యాఖ్యానించడం వెనుక కారణాలు చాలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుని ముందుకి వెళ్తున్నాయి.

ఏపీలో బీజేపీ 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని చూస్తోంది.పొత్తులో భాగంగా అవసరమైతే పవన్ కళ్యాణ్ ను ఎన్నికల ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు బిజెపి అధిష్టానం సిద్ధంగా ఉంది.ఈ పరిస్థితుల్లో రఘురామకృష్ణంరాజు పవన్ ముఖ్యమంత్రి అయితే, ఈ విధంగా అభివృద్ధి చేస్తామంటూ చెబుతుండడం వెనుక బీజేపీ వ్యూహం ఉందనే అభిప్రాయాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకుల్లో ఆనందాన్ని కలగిస్తుండగా, అసలు ఆయన ఎందుకు ఈ విధంగా పవన్ ప్రస్థావన తెచ్చాడనే ఆశక్తి, అనుమానం వైసీపీలో కనిపిస్తోంది.ఏది ఏమైనా రాజుగారు వ్యవహారం మాత్రం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది.

పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు..!!

Advertisement

తాజా వార్తలు