తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రలు జగన్, కేసీఆర్ మంచి మిత్రులే.ఆర్టీసీ, పోలవరంలాంటి విషయాల్లో ఒకరినొకరు ఇరికించుకునే వ్యాఖ్యలు చేయడంతో ఈ ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది.
అయితే ఈ మధ్య ఏపీ అసెంబ్లీలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందిస్తూ కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ అని జగన్ అనడం ఆసక్తి రేపింది.
ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారోగానీ.
ఇవి మాత్రం కేసీఆర్‌కు చిక్కులు తెచ్చి పెడతాయని అంటున్నారు తెలంగాణ బీజేపీ నేత రఘునందన్‌రావు.ఎన్‌కౌంటర్ అంతా కేసీఆర్ ఘనతే అన్నట్లు ఏపీ సీఎం, తెలంగాణ మంత్రులు, సాధారణ ప్రజలు మాట్లాడుతున్నారని.
అయితే ఇవి కేసీఆర్‌కు ఏమాత్రం మేలు చేసేవి కావని ఆయన స్పష్టం చేస్తున్నారు.

లాయర్ కూడా అయిన రఘునందన్‌రావు ఓ లా పాయింట్‌ను తెరపైకి తెస్తున్నారు.నిజానికి ఎన్‌కౌంటర్‌ను అందరూ సమర్థిస్తున్నా.చట్టం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు.
అందుకే ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే మానవ హక్కుల సంఘం రంగంలోకి దిగింది.సీపీ సజ్జనార్‌తోపాటు ఇతర పోలీసులపై కేసులు నమోదయ్యాయి.
సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
పైగా నిందితుల్లో ఇద్దరు మైనర్లని కూడా తాజా రిపోర్టుల్లో తేలింది.
ఇంత వివాదాస్పదమైన ఎన్‌కౌంటర్ కేసీఆర్ చెబితేనే జరిగిందన్నట్లుగా వీళ్లంతా చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకు చిక్కులు తెచ్చిపెడతాయన్న అభిప్రాయాన్ని రఘునందన్‌రావు వ్యక్తం చేశారు.ఇప్పటికే ఎన్‌కౌంటర్‌లో పాలుపంచుకున్న పోలీసులు చిక్కుల్లో పడ్డారని, ఇప్పుడు కేసీఆర్ మెడకు కూడా ఆ కేసు చుట్టుకునే ప్రమాదం ఉందని ఆయన అంటున్నారు.
నిజానికి ఈ కేసు అంత వరకూ వెళ్తుందో లేదో తెలియదుగానీ.రఘునందన్‌రావు చెప్పిన పాయింట్ మాత్రం ఆసక్తిగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.