మెగా ఫ్యామిలీ అంతా ఎప్పడూ కలిసికట్టుగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నా రాజకీయ విషయాల్లోకి వచ్చేసరికి భిన్న ధ్రువాల్లా వ్యవహరిస్తున్నారు.ఏపీ సీఎం జగన్ పై పవన్ తీవ్రంగా విరుచుకుపడుతున్న సమయంలో చిరంజీవి జగన్ ను పొగడడం వైరల్ గా మారింది.
అదికూడా ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కాకినాడలో నిరసన దీక్ష చేస్తున్నారు.రైతులకు ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ పవన్ దీక్షకు దిగారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఒకరోజు నిరాహార దీక్ష ఈ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
పవన్ కు మద్దతుగా ఆయన మరో సోదరుడు నాగబాబు కూడా దీక్షలో కూర్చున్నారు.
ఈ సందర్భంగా జగన్ పైనా, వైసీపీ ప్రభుత్వ విధానాలపైనా వారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.అయితే చిరు మాత్రం వారిద్దరికీ షాక్ ఇస్తూ సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే ఆయన ప్రశంసలు జగన్ వ్యవసాయ విధానంపై కాదు.బుధవారం సాయంత్రం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో క్రిమినల్ చట్టంలో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని చిరు సమర్థిస్తూ జగన్ కు కృతజ్ఞతలు చెప్పారు.
ఒకవైపు చిరు సోదరులు జగన్ పై విరుచుకుపడితే చిరు ప్రశంసించడం మెగా అభిమానులను కూడా గందరగోళంలోకి నెడుతోంది.







