హీరొ లని మించిపోయిన లారెన్స్

టాలీవుడ్‌, కోలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఒక్కో సినిమాలో నటించేందుకు కోట్లలో పారితోషికం తీసుకుంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మహేష్‌బాబు, పవన్‌, ప్రభాస్‌, చరణ్‌, రజినీ, సూర్య, విక్రమ్‌, ధనుష్‌, కార్తీ, విశాల్‌ ఇలాంటి వారు 15 నుండి 20 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు.

ఇక దర్శకులు కూడా హీరోలకు తగ్గట్లుగానే తీసుకుంటున్నారు.కొందరు దర్శకులు 10 కోట్లు ఆపై తీసుకుంటున్నారు అంటే అతి శయోక్తి కాదు.

ఇక తమిళ స్టార్‌ హీరోలు మరియు దర్శకులు కూడా ఇదే విధంగా పారితోషికాలను అందుకుంటున్నారు.ఇన్ని కోట్లు అందుకుంటున్న ఈ స్టార్స్‌ ఏదైనా ఆపద సమయంలో తాము ఉన్నాం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతూ చేసే సాయం మాత్రం జనాలను ఆశ్చర్య పర్చుతోంది.

తమిళనాడులో భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులు అయిన వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన స్టార్స్‌ ఇచ్చిన పారితోషికం 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఒక్కరిద్దరు మాత్రం 20 లక్షలు 25 లక్షలు ఇచ్చారు.ఒక్కో సినిమాకు 10 కోట్లకు మించి తీసుకున్న స్టార్స్‌ సైతం ఇంత తక్కువ సాయం అందించడం మనం చూస్తున్నాం.

Advertisement

చిన్న సాయానికి పెద్ద ప్రెస్‌మీట్‌లు, ప్రచారాలు చేస్తూ ఉంటారు.కాని వీరందరికి పూర్తి భిన్నం దర్శకుడు రాఘవ లారెన్స్‌.

మొదట చెప్పిన స్టార్స్‌తో పోల్చితే ఈయన రేంజ్‌ చాలా చిన్నది.అయినా కూడా సాయంలో వారిని తలదన్నాడు.

తమిళనాడులో వర్షాల వల్ల నష్టపోయిన వారికి సాయం చేసేందుకు గాను లారెన్స్‌ కోటి రూపాయ ఆర్థిక సాయంను అందించాడు.ఆ మధ్య అబ్దుల్‌ కలాం మరణించినప్పుడు కూడా కోటి రూపాయలతో ఆయన సంస్మరణార్థం సేవా కార్యక్రమాలు చేశాడు.

ఇలా లారెన్స్‌ చేస్తున్న సాయం రియల్‌ హీరోను చేస్తున్నాయి.ఈయన ముందు టాలీవుడ్‌, కోలీవుడ్‌ స్టార్స్‌ దిగదుడుపే.

Pokiri : పోకిరి సినిమా ఎందుకు ఆడిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు
Advertisement

తాజా వార్తలు